హెల్త్ టిప్స్

డ‌యాబెటిస్ ఉన్న‌వారు ఈ సూచ‌న‌లు పాటిస్తే షుగర్‌ను కంట్రోల్‌లో ఉంచుకోవ‌చ్చు..!

ఈరోజుల్లో చాలా మంది డయాబెటిస్ తో బాధపడుతున్నారు మీరు కూడా డయాబెటిస్ తో బాధపడుతున్నారా..? అయితే కచ్చితంగా మీరు దీనిని తెలుసుకోవాల్సిందే. ఈ కాలంలో డయాబెటిస్ ని కంట్రోల్ చేసుకోవడం చాలా ముఖ్యం. బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోకుండా తగిన పద్ధతుల్ని అనుసరిస్తూ ఉండండి. చాలా మంది డయాబెటిస్ వలన రకరకాల సమస్య సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు ఈ కాలంలో డయాబెటిస్ కంట్రోల్ లో ఉండాలంటే ఇలా చేయండి.

డీహైడ్రేషన్ కలగకుండా ఫ్లూయిడ్స్ ని ఎక్కువగా తీసుకోవడం చాలా ముఖ్యం డైట్ లో నీళ్లు ఎక్కువ ఉండాలి వాటితో పాటుగా తాజా పండ్లు జ్యూస్ లు వంటివి ఎక్కువగా ఉండాలి. వీటి వలన ఆరోగ్యం బాగుంటుంది. ఈ కాలంలో అస్తమను ఎండలో బయటకు వెళ్లడం వలన చెమట డిహైడ్రేషన్ మజిల్ క్రాంప్స్ నీరసం తలనొప్పి హార్ట్ బీట్ లో మార్పులు వికారం మొదలైన ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. డయాబెటిస్తో బాధపడే వాళ్ళు ఈ కాలంలో ఎండలో ఎక్కువసేపు ఎండలో ఉండడం మంచిది కాదు. డయాబెటిస్ తో బాధపడే వాళ్ళు షుగర్ ని కంట్రోల్ చేసుకోవాలని రకరకాల వ్యాయామ పద్ధతులను చేస్తూ ఉంటారు.

people with diabetes must follow these tips to get blood sugar in control

అయితే ఈ కాలంలో బయట వ్యాయామాలను చేయడం మంచిది కాదు ఇంట్లోనే వ్యాయామాలను చూసుకోవడం మంచిది. షుగర్ తో బాధపడే వాళ్ళు మంచి డైట్ ని కూడా పాటిస్తూ ఉండాలి. డైట్ విషయంలో తప్పకుండా శ్రద్ధ వహించాలి ఎక్కువగా ఫ్రై చేసిన ఆహార పదార్థాలు బాగా తియ్యగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోకూడదు. అదే విధంగా స్పైసీగా ఉండే ఆహార పదార్థాలు కూడా వేసవికాలంలో డయాబెటిస్తో బాధపడేవాళ్లు తీసుకోవడం మంచిది కాదు. ఇలా డయాబెటిస్తో బాధపడే వాళ్ళు ఈ కాలంలో ఈ టిప్స్ పాటిస్తే ఖచ్చితంగా షుగర్ సమస్యలకి చెక్ పెట్టచ్చు. లేకపోతే అనవసరంగా ఇబ్బంది పడాల్సి ఉంటుంది.

Admin

Recent Posts