హెల్త్ టిప్స్

కొలెస్ట్రాల్ లెవ‌ల్స్‌ను త‌గ్గించుకోవాల‌ని చూస్తున్నారా.. ఈ డ్రింక్స్ మీకు స‌హాయం చేస్తాయి..

చాలామంది రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు ఎక్కువమంది బాధపడే సమస్యలో కొలెస్ట్రాల్ ఒకటి. కొలెస్ట్రాల్ వలన వివిధ రకాల సమస్యలు తలెత్తుతాయి. సరైన ఆహార పదార్థాలను డైట్‌లో చేర్చుకోకపోవడం, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, చెడు కొలెస్ట్రాల్ మొదలైన కారణాల వలన కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోతూ ఉంటాయి. కొలెస్ట్రాల్ కారణంగా వివిధ రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. మీరు కూడా అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారా..? అయితే కచ్చితంగా వీటిని తీసుకోండి..

వీటిని తీసుకుంటే కొలెస్ట్రాల్ బాధే ఉండదు. మందారం టీ కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. మందారం టీ చాలా చక్కగా పనిచేస్తుంది మందారం పువ్వు తో టీ చేసుకుని తీసుకోవడం వలన కొలెస్ట్రాల్ బాధ ఉండదు. చెడు కొలెస్ట్రాల్ మొత్తం పోతుంది డయాబెటిస్ ప్రమాదం నుండి బయట పడొచ్చు. దానిమ్మ జ్యూస్ కూడా బాగా హెల్ప్ అవుతుంది. దానిమ్మ రసం తో కూడా ఈ సమస్య నుండి బయటపడొచ్చు. యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో అధికంగా ఉంటాయి కొలెస్ట్రాల్ లెవెల్స్ ని తగ్గించుకోవచ్చు. రెగ్యులర్ గా దానిమ్మ రసం ని తీసుకోవడం వలన బీపీ కంట్రోల్ లో ఉంటుంది హృదయ సంబంధిత సమస్యలు రావు.

take these drinks daily to reduce cholesterol levels

సోయా పాలని తీసుకుంటే శాఖాహారులకి ప్రోటీన్ బాగా అందుతుంది చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించుకోవచ్చు. కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడే వాళ్ళు సోయా పాలని కూడా తీసుకుంటూ ఉండండి. గ్రీన్ టీ తో కూడా కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి గ్రీన్ టీ లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి కొలెస్ట్రాల్ లెవెల్స్ ని గ్రీన్ టీ తో తగ్గించుకోవచ్చు త్వరగా బరువు కూడా తగ్గొచ్చు అయితే రోజుకి రెండు కప్పుల కంటే ఎక్కువ గ్రీన్ టీ ని తీసుకోవద్దు.

Admin

Recent Posts