హెల్త్ టిప్స్

ఈ ఆహారాల‌ను రోజూ తింటే చాలు.. మీ ర‌క్తం శుభ్రంగా మారుతుంది..!

ఎక్కడ చూసినా కాలుష్యమే. మీ శరీరంకూడా కాలుష్యంలోనే జీవిస్తోంది. ఎన్నో మలినాలు, విష పదార్ధాలు రోజూ మీకు హాని కలిగిస్తుంటాయి. ఇవన్ని మెల్లగా రక్తంలోకి కూడా చేరిపోతాయి. ఎందుకంటే మరి మీ రక్తమే శరీరంలోని మలినాలను కూడా మోసుకుపోతూ వుంటుంది. కనుక ఈ మలినాలను విసర్జించాలంటే రక్తాన్ని ఎప్పటికపుడు శుభ్ర పరచుకోవాలి. అందుకుగాను మలినాలను విసర్జించి రక్తాన్ని శుభ్రం చేసే ఆహారాలు కొన్ని చూడండి. మరి ఈ రక్తం శుభ్రపడితే మీరు పొందేది ఏమిటి? మెరిసే చర్మం లేదా ఆరోగ్యాన్నిచ్చే ఆకలి ఆనందిస్తారు. అంతకు ముందుకంటే కూడా మరింత ఆరోగ్యంగా వుంటారు.

నిమ్మ – శరీరంలోని విషపదార్ధాలను నెట్టెయ్యాలంటే నిమ్మరసం బాగా పని చేస్తుంది. గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం తేనె కలిపి ప్రతిరోజూ ఒక గ్లాసెడు తీసుకుంటే చాలు రక్తం శుభ్రపడటమే కాక అధిక బరువు కూడా తగ్గుతుంది. ఒక వారంలో మీ ఆకలి స్ధాయి ఎలా వుంటుందో కూడా మీరు తెలుసుకోగలరు. మిరియాలు – మీరు తినే ఆహారాలలో వేసే మిరియం రుచే కాదు మీకు అమోఘమైన రక్త శుభ్రతనిస్తుంది. అయితే, మసాలాలు తినకూడని వారికి ఇది తినటం హానికరమే. పచ్చని కూరలు – పచ్చని కూరలు మీ రక్తాన్ని శుబ్రపరుస్తాయి. వాటిలో క్లోరోఫిల్ వుంటుంది. ఇది మనిషిలో మనోవేదన లేకుండా చేస్తుంది. కనుక డిన్నర్ టేబుల్ వద్ద కూరల సలాడ్లు తినడం మరువకండి.

take these foods daily to purify your blood

కేరట్ , బీట్ రూట్ – కేరట్, బీట్ రూట్ లలో వుండే కెరోటిన్ మీ కళ్ళకు, చర్మానికి కూడా మంచిదే. కెరోటిన్ రక్తశుభ్రతకు తోడ్పడుతుంది. అంతేకాదు మలవిసర్జనకవసరమైన పీచు వీటిలో బాగా వుంటుంది. వెల్లుల్లి – వెల్లుల్లి ప్రయోజనాలు ఎంత చెప్పినా తక్కువే. శరీర మలినాలు శుభ్రపరచేటందుకు మంచి ఆహారం. మీ రక్తాన్ని కొత్తదిగా చేస్తుంది. కొత్త కణాలను వేగంగా పుట్టిస్తుంది. పచ్చి వెల్లుల్లి తినగలిగితే ఎంతో ఆరోగ్యం. రక్తాన్ని శుభ్ర పరచాలంటే ఈ పదార్ధాలను మీ ఆహారంలో క్రమం తప్పకుండా చేర్చండి.

Admin

Recent Posts