హెల్త్ టిప్స్

మీ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహారాల‌ను తినాలి..!

ఆరోగ్యకర ఆహారం తింటే ఆరోగ్యం కలిగిస్తుంది. ఆహారం సరిలేకుంటే, బ్లడ్ ప్రెజర్, కొల్లెస్టరాల్, బ్లడ్ షుగర్, ఊబకాయం, గుండె జబ్బులు మొదలైనవి వస్తాయి. గుండె జబ్బులకు కారణం మనం తీసుకునే ఆహారమేనంటారు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ మాజీ ప్రెసిడెంట్ డొన్నా అర్నెట్టా. ప్రతి ముగ్గురు అమెరికన్లలోను ఒకరి గుండె జబ్బులకు కారణం ఆహారంలో సోడియం అధికంగా వుండటమంటారు ఈపరిశోధకులు.

సోడియం మీ కణాలలోకి నీటిని ఆకర్షిస్తుందని, అధికమైన ఈ నీరు బ్లడ్ ప్రెజర్ పెంచుతుందని, తర్వాతి దశలో స్ట్రోక్ లేదా గుండె పోటు తెప్పించి మరణం సంభవించేలా చేస్తుందని తెలిపారు. మీరు తినే ఆహారంలో పండ్లు, కాయగూరలు అధికం చేయండి. ప్రత్యేకించి ఆకు కూరలు ప్రతిరోజూ తింటే వాటిలోని పొటాషియం బ్లడ్ ప్రెజర్ తగ్గిస్తుంది. సోడియం ప్రభావం ఆహారాలపై తగ్గించాలంటే, వాటిని వండే ముందు బాగా కడగండి. వారానికి కనీసం రెండు సార్లు చేపలు తినాలి.

take these foods if you want your heart healthy

ఈ చేప ఆహారం గుండె వ్యాధులను తగ్గిస్తుంది. ఆహారం తినేటపుడు శాట్యురేటెడ్ కొవ్వులు అంటే వెన్న, ఛీజ్, రెడ్ మీట్ వంటివి తగ్గించి తినాలి. ప్యాకేజీ ఆహారాలు చెడు కొల్లెస్టరాల్ పెంచుతాయి. కనుక హైడ్రోజనేటెడ్ ఆహారాలు తీసుకోండి. సోడాలు, ఎనర్జీ డ్రింకులు మానండి. వీటిలోని షుగర్ యువతకు బరువు పెంచుతుంది.

Admin

Recent Posts