హెల్త్ టిప్స్

ఇవి రెండూ మీకు ఇష్ట‌మైన ఆహారాలే.. గుండెకు ఎంతో మేలు చేస్తాయి..!

మీరు అధికంగా ప్రేమించే వ్యక్తులకు ఇష్టంగా ఏదో ఒక ఆహారాన్ని తినిపిస్తూ వుండటం సహజం. దానికిగల కారణం వారిపై మనకు వుండే హృదయపూర్వక ప్రేమ మాత్రమే. ఇప్పటికే డార్క్ చాక్లెట్, రెడ్ వైన్ రెండూ కూడా గుండెకు మేలు చేస్తాయని అనేక పరిశోధనలు నిరూపించాయి. అయితే, తాజాగా చేసిన ఒక స్టడీలో డార్క్ చాక్లెట్, రెడ్ వైన్, ఈ రెండూ కూడా ప్రేమకు ప్రతిరూపాలని వాస్తవమైన ఆహారమని రీసెర్చర్లు చెపుతున్నారు.

రెడ్ వైన్, డార్క్ చాకోలేట్ లలో కోకో 70 శాతం పైగా వుంటుందని, డార్క్ చాక్లెట్ లో రిస్విరేట్రల్ అనే పదార్ధం అధికమని ఈ పదార్ధం రక్తంలోని షుగర్ స్ధాయిని తగినట్లుగా తగ్గిస్తుందని తెలిపారు. రెడ్ వైన్ లో కూడా కేటే ఛిన్స్ అనే పదార్ధం శరీరానికవసరమైన మంచి కొల్లెస్టరాల్ ను పెంచుతుంది.

these are your favorite foods best for heart health

కనుక రెడ్ వైన్ మరియు డార్క్ చాకోలేట్, రెండూ కూడా గుండెకు చాలా మంచి ఆహారాలని గొట్టిలీబ్ మెమోరియల్ హాస్పిటల్ రీసెర్చర్ సుసన్ ఆఫ్రియా వెల్లడించారు. రెడ్ వైన్, డార్క్ చాక్లెట్ లు రెండూ కూడా మార్కెట్ లో తేలికగా లభ్యమయ్యేవే. కనుక మీ కిష్టమైన వారికి ఇకపై ఈ తినుబండారాలు ఇచ్చి మీ ప్రేమను పంచుతూ వారికి గుండె సంబంధిత సమస్యలు లేకుండా చేయొచ్చు.

Admin

Recent Posts