హెల్త్ టిప్స్

రోజూ భోజ‌నంలో పెరుగును త‌ప్ప‌నిస‌రిగా తినాల్సిందే.. ఎందుకంటే..?

కొందరు పెరుగు ఇష్టంగా తింటారు.. సంపూర్ణ భోజనామృతం అంటే చివరన పెరుగుతో తింటేనే అని చాలామంది అలానే ఫాలో అవుతారు. కాని కొందరికి పెరుగు అసలు పడదు. ఈకాలం చిన్న పిల్లలు పెరుగుని దగ్గరకు కూడా రానివ్వరు. ఎలాగోలా బుజ్జగించి పెరుగుని అలవాటు చేయాలి. పెరుగులో కాల్షియం ఎక్కువ ఉండటం వల్ల ఎముకలు గట్టి పడే అవకాశం ఉంటుంది.

అంతేకాదు రోజు కప్పు పెరుగుతు తింటే రక్తపోటు సమస్యని కాస్త కంట్రోల్ చేసుకోవచ్చు. జబులు చేస్తే పెరుగు తినకూడదని అంటారు కాని పెరుగులో మిరియాల పొడి, బెల్లం వేసుకుని తీసుకుంటే జబులు తగ్గుముఖం పడుతుంది. పెరుగు ఇష్టం లేని వారు మజ్జిగ రూపంలో తీసుకోవచ్చు. వేసవి కాలంలో మజ్జిగ‌ డీహైడ్రేషన్ సమస్యలు రాకుండా చేస్తుంది.

we must take curd daily know the reasons

పెరుగు విరేచ‌నాలకు మంచి ఔషధ‌మని అంటారు. వేడి వేడి అన్నంలో పెరుగు తింటే మోషన్స్ కంట్రోల్ అవుతాయని డాక్టర్స్ చెబుతున్నారు. వాతం తగ్గించడమే కాదు పెరుగులో కాస్త ఉప్పు వేసుకుని తింటే అజీరి సమస్య తగ్గుతుంది. ఇంకా పెరుగు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి పెరుగుని తప్పకుండా రోజు ఆహారంలో తీసుకుంటే మంచిది.

Admin

Recent Posts