మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ గురించి అందరికీ తెలిసిందే. యుక్త వయస్సులోనే కంప్యూటర్ ఇంజినీర్ అయి హ్యాకర్‌గా మారి అనంతరం సొంతంగా మైక్రోసాఫ్ట్ కంపెనీని ఏర్పాటు చేశాడు. తరువాత అంచెలంచెలుగా ఎదిగాడు. ఈ క్రమంలో ప్రపంచంలోనే నంబర్ వన్ శ్రీమంతుడిగా పేరుగాంచాడు. అయితే నిజానికి బిల్‌గేట్స్ మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్న ఏ ధనికుడు అయినా విలాసవంతమైన ఐఫోన్‌ను వాడుతారు. ఎందుకంటే అది స్టేటస్ సింబల్ అని చాలా మంది భావిస్తారు. కానీ మీకు తెలుసా..? అందరు ధనికుల్లా బిల్‌గేట్స్ కాదు, ఎందుకంటే ఆయన అత్యంత సంపన్నుడు అయినా ఇంకా ఆండ్రాయిడ్ ఫోన్‌నే వాడుతారు..! అవును, మీరు విన్నది కరెక్టే. మరి అందుకు కారణం ఏమిటో తెలుసా..?
బిల్‌గేట్స్ చాలా సంపన్నుడు అయినా ఆయన ఐఫోన్‌ను వాడరు. ఆండ్రాయిడ్ ఫోన్‌నే వాడుతారు. ఎందుకంటే… ఐఫోన్‌లో ఉండేది ఐఓఎస్. అయితే ఈ ఐఓఎస్ అనేది కేవలం ఐఫోన్‌లో మాత్రమే ఉంటుంది. ఇతర ఫోన్లలో ఉండదు. ఎందుకంటే యాపిల్ ఈ ఓఎస్‌ను ఓపెన్ సోర్స్ చేయలేదు. ఆ సంస్థే డెవలప్ చేస్తోంది. ఇక ఆండ్రాయిడ్ అలా కాదు. గూగుల్ ప్రధాన డెవలపర్ అయినప్పటికీ మొబైల్ తయారీ కంపెనీలు ఆండ్రాయిడ్ సోర్స్ కోడ్‌ను తీసుకుని తమ ఫోన్లకు అనుగుణంగా సొంతంగా డెవలప్ చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే వినియోగదారులకు మరింత సెక్యూరిటీని అందించేలా తమ సొంత ఆండ్రాయిడ్ వెర్షన్‌లను ఫోన్లలో అందిస్తున్నాయి. దీంతో సెక్యూరిటీ బాగుంటుందన్న ఉద్దేశంతోనే బిల్ గేట్స్ ఇప్పటికీ ఐఫోన్‌ను కాకుండా ఆండ్రాయిడ్ ఫోన్‌నే వాడుతున్నారట.
ఇక బిల్ గేట్స్ ఆండ్రాయిడ్ ఫోన్‌ను వాడడానికి గల మరో కారణం ఏమిటంటే… ఆయన మైక్రోసాఫ్ట్ పెట్టక ముందు ఓ కంపెనీకి చెందిన కంప్యూటర్‌ను హ్యాక్ చేశారట. అయితే దాన్ని దృష్టిలో ఉంచుకుని హ్యాకింగ్ చేయడం అంత సులభం కాని ఫోన్‌ను వాడాలని బిల్‌గేట్స్ అనుకున్నారు. అయితే అలాంటి ఫోన్లలో ఆండ్రాయిడ్ ఫోనే ఉత్తమమని భావించారు. అందుకే బిల్‌గేట్స్ ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారు. అయితే ఆయన ఆండ్రాయడ్ ఫోన్‌ను వాడినా అందులో ఎక్కువగా మైక్రోసాఫ్ట్ యాప్స్‌నే వాడుతారట. ఇక ఆయన ఆండ్రాయిడ్ ఫోన్‌ను వాడేందుకు గల మరో కారణం ఏమిటంటే… ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ నిజంగా అచ్చం విండోస్ పీసీ లాంటి ఫీచర్లనే కలిగి ఉంటుంది. దాన్ని యూజర్ తనకు ఇష్టం వచ్చినట్టుగా మార్చుకోవచ్చు. ఫైల్స్‌ను ఆర్గనైజ్ చేసుకోవచ్చు. సరిగ్గా విండోస్ పీసీలు కూడా ఇలాగే ఉంటాయి. కనుకనే ఆండ్రాయిడ్ ఫోన్ అంటే ఇష్టపడి దాన్నే వాడుతున్నారట బిల్‌గేట్స్..! నిజంగా ఈ విషయం ఆశ్చర్యమే కదా..!