హెల్త్ టిప్స్

చేతుల‌కు గోరింటాకు పెట్టుకుంటే ఇన్ని ఉప‌యోగాలు ఉన్నాయా..?

గోరింటాకు పెట్టుకోవ‌డ‌మంటే ఆడ‌వారికి ఎంతో ఇష్టం. దీనికి కుల‌, మ‌త‌, ప్రాంత‌, వ‌ర్గాల‌తో సంబంధం లేదు. ఏ వ‌ర్గానికి చెందిన వారైనా, ఏ మ‌తం వారైనా గోరింటాకును అలంక‌ర‌ణ కోసం పెట్టుకుంటారు. ఇక పండుగ‌లు, శుభకార్యాల వంటివి వ‌స్తే ఆడ‌వారు చేతులు, కాళ్ల‌కు మెహెందీ పెట్టుకుని త‌మ ముచ్చ‌ట తీర్చుకుంటారు. అయితే నేటి త‌రుణంలో చాలా మంది కృత్రిమ ప‌దార్థాలు క‌లిపిన గోరింటాకునే ఎక్కువ‌గా వాడుతున్నారు. కానీ గోరింట చెట్టు ఆకుల నుంచి త‌యారు చేసిన గోరింటాకును పెట్టుకుంటేనే దాంతో ఎన్నో లాభాలు క‌లుగుతాయి. మ‌హిళ‌లు కేవ‌లం పండుగ‌లు, శుభకార్యాల స‌మ‌యంలోనే కాక త‌ర‌చూ గోరింటాకును పెట్టుకుంటే దాంతో ప‌లు అనారోగ్యాల‌ను దూరం చేసుకోవ‌చ్చు. గోరింటాకు వ‌ల్ల ఏయేం లాభాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

గోరింటాకును ఎండ‌బెట్టి పొడి చేసుకోవాలి. దాంట్లో కొద్దిగా ల‌వంగం పొడి క‌లిపి జుట్టుకు ప‌ట్టిస్తే జుట్టు ఎరుపు రంగులోకి మారుతుంది. అదే ల‌వంగ పొడికి బ‌దులుగా ఉసిరి పొడిని క‌లిపి జుట్టుకు ప‌ట్టిస్తే జుట్టు న‌లుపు రంగులోకి మారుతుంది. గోరింటాకుకు శరీరంలో ఉండే వేడిని తగ్గించే శక్తి ఉంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. గోరింటాకును పెట్టుకోవ‌డం వ‌ల్ల మాన‌సిక రుగ్మ‌త‌ల‌న్నీ తొల‌గిపోతాయి. మాన‌సికంగా ప్ర‌శాంత‌త చేకూరుతుంది. ఆందోళ‌న‌, ఒత్తిడి, టెన్ష‌న్ వంటివి త‌గ్గిపోతాయి. గోరింటాకులో కొద్దిగా నీళ్ల‌ను పోసి బాగా నూరి మిశ్ర‌మంగా చేసుకోవాలి. దీంట్లో కొంత నిమ్మ‌ర‌సం క‌లిపి చేతులు, కాళ్లు, పాదాల‌కు పెట్టుకుంటే దుర‌ద‌లు, మంట‌లు త‌గ్గిపోతాయి. చ‌ర్మ స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి.

wearing gorintaku gives these wonderful health benefits

గోరింటాకులను నూరి మిశ్ర‌మంగా చేసి దాన్ని గోళ్ల‌ చుట్టూ పెట్టుకుంటే గోరు చుట్టు వంటి వ్యాధులు త‌గ్గిపోతాయి. గోళ్లు అందంగా మారుతాయి. గోళ్ల‌లో ఉండే స‌మ‌స్య‌లు పోతాయి. గోరింటాకు 6 గ్రాములు, వెల్లుల్లి ఒక రేకు, మిరియాలు 5 క‌లిపి దంచి మిశ్ర‌మంగా చేసుకోవాలి. దీన్ని ప్ర‌తి రోజూ ఉద‌యాన్నే తింటే లైంగిక వ్యాధులు తగ్గిపోతాయి. అయితే ఆ స‌మ‌యంలో ఉప్పు త‌క్కువ‌గా తినాలి. కారం, చింత‌పండు మానేయాలి.

గోరింటాకుల‌ను రాత్రంతా నీటిలో నాన‌బెట్టి ఉద‌యాన్నే ఆ ఆకుల‌ను ఉడికించి క‌షాయంగా చేసుకోవాలి. దాంట్లో శుభ్ర‌మైన గుడ్డ‌ను ముంచి దాంతో బెణుకులు, నొప్పులు, గాయాలు ఉన్న‌చోట మ‌ర్ద‌నా చేసిన‌ట్టు రాయాలి. దీంతో నొప్పి నుంచి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. గోరింటాకు పువ్వులను తల కింద పెట్టి నిద్రపోతే గాఢ నిద్ర వస్తుంది. నిద్ర బాగా ప‌డుతుంది. నిద్ర‌లేమి స‌మ‌స్య ఉన్న‌వారికి ఇది ఎంత‌గానో మేలు చేసే అంశం. గోరింటాకు పువ్వుల‌ను త‌ల కింద పెట్టి నిద్ర పోవ‌డం వ‌ల్ల మెద‌డులో ఏర్ప‌డ్డ వేడి త‌గ్గుతుంది. మ‌రుస‌టి రోజంతా ఉత్సాహంగా ఉంటుంది.

Admin

Recent Posts