పోష‌ణ‌

యుక్త వ‌య‌స్సులో ఉన్న బాలిక‌లు త‌ప్ప‌నిస‌రిగా తీసుకోవాల్సిన ఆహారాలు ఇవి..!

యుక్తవయసులో బాలికలు పోషకాహారం బాగా తినాలి. ఈ వయసులో తినే ఆహారం వారిని జీవితాంతం ఆరోగ్యంతో వుంచుతుంది. యుక్తవయసు అంటే శరీరం సంతానోత్పత్తికి సిద్ధం కాగల సమయం అని గుర్తించాలి. శరీరంలో హార్మోన్ల మార్పులు వస్తాయి. సాధారణంగా బాలికలు 10 నుండి 15 సంవత్సరాల మధ్య యుక్తవయసు పొందుతారు. ఈ వయసులో వారికి అధికంగా తినాల్సిన పోషకాహారాలు పరిశీలించండి. కాల్షియం – భవిష్యత్ జీవితంలో వీరికి ఎముకల అరుగుదల సమస్య రాకూడదనుకుంటే, యుక్తవయసులో కాల్షియం సంబంధిత ఆహారాలు బాగా తినాలి. తక్కువ కొవ్వు వుండే పెరుగు, పాలు, జున్ను వంటివి, ఇతర కాల్షియం అధికంగాగల తిండ్లు తినాలి.

ఐరన్ – యుక్తవయసులో బాలికలకు ఇది చాలా ప్రధానం. పిరీయడ్ లో వీరికి చాలా రక్తం పోతుంది అందుకుగాను ఐరన్ అధికంగా వుండే ఆహారాలు, గింజధాన్యలు, చేపలు, బీన్స్, మాంసం తినాలి. అయితే, బాలికలు ఈ సమయంలో తాము తినే తిండికి హార్మోన్లు పెరుగుతాయి కనుక, బరువు ఎక్కకుండా చూసుకోవాలి. ప్రొటీన్లు – ప్రొటీన్లు కండరాలు, ఇతర కణజాలాన్ని నిర్మిస్తాయి. రోజువారీ చర్యలకు వారు శక్తి కలిగి చురుకుగా వుండాలంటేప్రొటీన్ అధికంగా వుండే ఆహారాలు, చేపలు, మాంసం, కోడి సంబంధిత ఉత్పత్తులు బాగా తినాలి.

teen age girls must take these foods for their health

కొవ్వులు – యుక్తవయసులో కొవ్వులు కూడా కొంతవరకు తీసుకోవాలి. అది ఎదుగుదల, శక్తి ఇస్తాయి. తగిన మొత్తాలలోసాల్మ‌న్ చేపలు, కాయలు, పండ్లు, ఆలివ్ ఆయిల్ వంటివి తీసుకొని ఎనర్జీ పొందాలి.

బరువు – యుక్తవయసు హార్మోన్లు స్తనాలు, తొడలు, పిరుదుల భాగాలలో కొవ్వు పేరుకునేట్లు చేస్తుంది. బరువు తగ్గాలనే వెర్రితో బాగా సన్నబడి, రక్తహీనత ఏర్పడకుండా చూడాలి. సరైన తిండ్లు తినడం, తగిన వ్యాయామం చేయడం. తగిన నీరు తాగడం వంటివి ఈ దశలో బాలికలకు ఎంతో అవసరం.

Admin

Recent Posts