చిట్కాలు

ఉల్లిపాయ‌ల‌తో ఇలా చేస్తే చాలు.. మీ జుట్టు పొడ‌వుగా పెరుగుతుంది..

ఒక వ్యక్తిని చూడగానే ఆకట్టుకోవాలంటే అందమైన, ఒత్తైన జుట్టు కూడా ఉండాలి. జుట్టు రాలిపోయినా.. తగ్గిపోయినా వయసు అయిపోయినట్లే కనిపిస్తుంది. అనేకమంది వేలకు వేలు రూపాయలు పోసి ఊడిపోయిన జుట్టుని తిరిగి మొలిపించుకునే ట్రీట్ మెంట్ చేయించుకుంటున్నారు. కానీ మన వంటింటిలోనే ఉల్లిపాయ జుట్టుని తిరిగి రప్పించేందుకు అద్భుతంగా పనిచేస్తుందని తాజాగా జరిగిన పరిశోధనల్లో తెలిసింది.ఉల్లిపాయలతో శిరోజాలకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం.

ఉల్లిపాయలను తీసుకొని మెత్తని పేస్ట్ లా మిక్సీ పట్టి.. ఆ పేస్ట్ ను తలవెంట్రుకల కుదుళ్లకు తగిలేలా రాసుకుంటే ఊడిపోయిన వెంట్రుకలు మళ్ళీ మొలకెత్తుతాయట. ఉల్లిపాయల్లో ఉండే సల్ఫర్ వల్లే ఇది సాధ్యం అవుతుందని పలు పరిశోధనలు చెబుతున్నాయి.

do like this with onion to prevent hair fall

ఉల్లిపాయలను బాగా దంచి ఆ మిశ్రమంలో కాస్త కొబ్బరినూనె లేదా ఇతర తైలాలను కలిపి రాసుకుంటే శిరోజాలు వత్తుగా పెరుగుతాయి అంతేగాక కుదుళ్ళు దృఢమవుతాయి. ఉల్లిపాయలను మెత్తగా దంచి వాటినుండి తీసిన రసంలో కొద్దిగా తేనె నిమ్మరసం కలిపి ఆ మిశ్రమాన్ని మాడుకి పట్టించాలి.. అలా అరగంటపాటు వేచిఉన్న తర్వాత తలస్నానం చెయ్యాలి. దీంతో చుండ్రు సమస్య నుండి బయటపడవచ్చు. జుట్టు కూడా కాంతివంతం అవుతుంది.

Admin

Recent Posts