చిట్కాలు

వాంతికి వ‌చ్చిన‌ట్లు ఉండ‌డం, వికారం వంటి స‌మ‌స్యలు త‌గ్గాలంటే ఈ చిట్కాల‌ను పాటించండి..!

వాంతి కలుగుతోందంటేనే ఎంతో చికాకుగా వుంటుంది. కాని కొన్ని సందర్భాలలో వాంతులు, వికారాలు వచ్చి తీరతాయి. అటువంటపుడు ఏ రకమైన చర్యలు చేపట్టాలో పరిశీలించండి. నూనె వస్తువులు, బజారు తయారీలు తినకండి. అవి అరుగుదల కష్టం. ద్రవపదార్ధాలు అధికంగా తీసుకోండి. నిమ్మరసం, కొబ్బరినీరు, మజ్జిగ మొదలైనవి మీ జీర్ణ వ్యవస్ధను శుభ్రం చేసి హాయిగా వుంచుతాయి.

ప్రయాణంలో వికారం కలిగితే చాలావరకు అది మానసికం. ప్రయాణానికి కొద్ది గంటల ముందే ఆహారం తీసుకోండి. జీర్ణం అయ్యేందుకు ఒక టాబ్లెట్ వేస్తే ఆసమయానికి అరిగిపోతుంది. హాయిగా వుంటుంది. వికారంగా వుంటే ఆపిల్, రేగుపండు, ఆరెంజ్ వంటివి తినండి. లవంగం, యాలుకలు పొడి, అల్లం, పుదీనా, తేనె వంటివి నిమ్మరసంతో కలిపి తీసుకుంటే వాంతి వచ్చే వికార భావన పోతుంది.

follow these remedies to get rid of nausea and vomiting

వికారానికి టీ కూడా పనిచేస్తుంది. హెర్బల్ టీ అయితే మంచిది. మజ్జిగ లో జీలకర్ర లేదా మెంతులు కలిపి తీసుకుంటే పొట్ట సమస్యలు తీరతాయి. ఒక్క గ్లాసు వేడినీరు అల్లంతో కలిపి తీసుకుంటే వెంటనే పనిచేస్తుంది. మీ కిష్టమైన సినిమా చూస్తూ లేదా మ్యూజిక్ వింటూ కూడా ఆ భావన మళ్ళించవచ్చు. వేడి నీటిని పుక్కిలించి పారపోయండి. మీకు హాయి అనిపిస్తుంది.

Admin

Recent Posts