చిట్కాలు

వేసవిలో ఇబ్బంది పెట్టే చెమట,చెమట వాసనను నివారించే సహజ పద్దతులు…

<p style&equals;"text-align&colon; justify&semi;">వేసవిలో ప్రతి ఒక్కరినీ ఇబ్బంది పెట్టేది చెమట&period; అది పెట్టే చికాకు అంతా ఇంతా కాదు&period; చెమటతో కొన్ని సందర్భాల్లో నలుగురిలో తల ఎత్తుకోలేని పరిస్థితి నెలకొంటుంది&period; చెమట వాసనతో నలుగురితో కలవాలంటే జంకు&comma; ఎవరి దగ్గరికైనా వెళ్లాలన్నా భయం కలుగుతుంది&period; వేసవిలో చిన్నా పెద్దా అందరూ చెమట వాసనతో ఇబ్బంది పడుతుంటారు&period; కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే చెమటతో వచ్చే దుర్గంధం నుంచి బయటపడొచ్చని చెబుతున్నారు డాక్టర్లు&period; బాహుమూలాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి&period; డియోడరెంట్లకు బదులు సమ్మర్ లో యాంటిపెరిస్పెరెంట్ వాడాలి&period; ఘాటు వాసన వచ్చే ఆహార పదార్థాలు తినడం మానేయాలి&period;తేలికపాటి ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి&period; ప్రతి అరగంటకు ఒకసారి మంచి నీరు ఎక్కువగా తాగాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రెండు పూటలా స్నానం చేయాలి&period; స్నానం చేసేటప్పుడు డెటాల్&comma; యుడుకోలోన్&comma; రోజ్‌వాటర్ వీటిలో ఏదైనా కొన్ని చుక్కలు కలుపుకొని స్నానం చేయాలి&period; ఎండాకాలంలో కాటన్ దస్తులనే వాడాలి&period; అది కూడా పల్చటి బట్టలనే వాడాలి&period; సింథటిక్ బట్టలను ఎట్టిపరిస్థితుల్లోనూ వాడకూడదు&period; ఇవి చెమటను మరింత ఎక్కువగా వచ్చేలా చేస్తాయి&period; చిన్న పసుపు ముక్కను పేస్ట్‌లా రుబ్బుకొని శరీరానికి పూసి స్నానం చేయాలి&period; ఇలా కొన్ని రోజుల పాటు చేస్తే దుర్వాసన రాకుండా ఉంటుంది&period; దుర్వాసన మరీ ఎక్కువగా ఉంటే వైద్యులను సంప్రదించాలి&period; సగం నిమ్మకాయని తీసుకుని చెమట ఎక్కువగా పట్టే చోట బాగా రుద్దాలి&period;తరువాత శుభ్రం గా స్నానం చేయాలి&period; ఇది రోజు ఒక్కసారైనా తప్పకుండ చేయాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-76395 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;sweat-smell&period;jpg" alt&equals;"how to remove excessive sweat and smell " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నాలుగు టమాటాలు తీసుకుని పేస్టులా చేసి దాన్ని వడకట్టి జూస్ విడిగా తీయాలి&period; ఆ జూస్ ని ఒక బకెట్ నీటిలో కలిపి&comma; ఆ నీటితో స్నానం చేస్తే శరీర దుర్వాసన తగ్గించుకోవచ్చు&period;ఇవి స్వేద గ్రంధుల ను కొంచం ముడుచుకునేలా చేసి తక్కువ చెమట పట్టేలా చేస్తుంది&period; కొన్ని పుదీనా ఆకులును ఒక బకెట్ నీటిలొ కలిపి స్నానం చేస్తే ఆ రోజంతా చర్మం తాజాగా ఉంటుంది&period; టేబుల్ స్పూన్ వంట సోడా &comma; టేబుల్ స్పూన్ నిమ్మ రసం తో కలిపి చంకలలో మరియు ఎక్కువగా చెమట పట్టే చోట రాసుకుని 5 నిముషాల తరువాత నీటి తో కడిగేసుకోవాలి&period; ఇలా ప్రతి రోజు చేయాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వంట సోడా&comma; తేమ ని ఎక్కువగా పీల్చివేస్తుంది&period; అది బాక్టీరియా ని చంపి శరీర దుర్వాసనని తగ్గిస్తుంది&period; మీరు స్నానం చేసే నీటిలో ఒక టేబుల్ స్పూన్ తేనె కలిపి ఆ నీటితో స్నానం చేస్తే శరీర నుండి వచ్చే చెడు వాసనను నివారించవచ్చు&period; పైన చెప్పిన వాటన్నిటితో పాటు ఎక్కువగా మంచినీళ్ళు తాగటం&comma; ఎక్కువగా పండ్లను తింటూ&comma; బయట చిరుతిండ్లు తినడం మానేస్తే మంచి ఫలితం ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts