చిట్కాలు

అధిక బరువా.. పర‌గడుపున ఇది తాగండి ఇట్టే తగ్గుతారు..!!

ప్రస్తుత కాలంలో చాలామంది వివిధ జాబులరీత్యా పట్టణాలకు వెళ్లి నివసిస్తూ ఉంటారు. ఈ తరుణంలో వారు ఎక్కువగా జంక్ ఫుడ్ కి అలవాటు పడి లావెక్కుతారు.. కనీసం వ్యాయామం కూడా చేయకుండా ఉండడంతో వివిధ అనారోగ్య సమస్యలు తెచ్చుకుంటారు.. అలా అధిక బరువు పెరిగి అనారోగ్య సమస్యలతో బాధపడేవారు , బరువు తగ్గాలంటే కొన్ని సహజసిద్ధమైన చిట్కాలు పాటించాలి.. అవేంటో ఇప్పుడు చూద్దాం.. ముఖ్యంగా బరువు తగ్గడంలో సోంపు గింజలు అనేవి మనకు ఎంతో ఉపయోగపడతాయి.

సోంపు గింజలను ఎక్కువగా వంటల్లో వాడుతూ ఉంటాం. ఈ సోంపు గింజలు తినడం వల్ల జీర్ణశక్తి మెరుగవడంతో పాటుగా బరువును కూడా తగ్గిస్తుందని వైద్య నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా ఈ సోంపు గింజలతో చక్కని పానీయాన్ని కూడా తయారు చేసుకుని తాగడం వల్ల బరువు చాలా సులభంగా తగ్గుతారు.. అదెలాగో ఇప్పుడు చూద్దాం.. ఒక గ్లాసు నీటిని తీసుకొని ఒక టీ స్పూన్ సోంపు గింజలను వేసి రాత్రి అంతా నానబెట్టాలి. ఉదయాన్నే ఈ నీటిని సోంపుతో సహా గిన్నెలో పోసి మరిగించాలి.

take fennel seeds water in the morning to reduce weight

అలా నీళ్లు సగం అయ్యేవరకు మరిగించి, వేడి తగ్గిన తర్వాత ఇందులో నిమ్మరసం కలపాలి. ఇలా తయారు చేసుకున్న పానీయాన్ని ప్రతిరోజు ఉదయం పర‌గడుపున తాగడం వల్ల బరువు తగ్గుతారు. దీనిని క్రమం తప్పకుండా 45 రోజులకు పైగా పాటిస్తే మీ శరీరంలో మార్పు మీరే గమనిస్తారు. ఈ పానీయాన్ని తాగే సమయంలో మీరు జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలి. అంతేకాకుండా వంటల్లో నూనెను కూడా తక్కువగా తినాలి. ప్రతిరోజు వ్యాయామం చేస్తూ ఉండాలి. ఇవి పాటించడం వల్ల బరువు తగ్గడంతో పాటు జీర్ణ సంబంధిత సమస్యలు కూడా తొలగిపోతాయని వైద్య నిపుణులు అంటున్నారు.

Admin

Recent Posts