information

ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డీ)పై లోన్ తీసుకుంటే ఎంత మొత్తం ఇస్తారు..? రుణ కాల ప‌రిమితి ఏమిటి..?

సాధార‌ణంగా బ్యాంకుల నుంచి రుణం తీసుకుంటే వారు రెండు ర‌కాలుగా లోన్లు ఇస్తారు. ఏవైనా వ‌స్తువులు లేదా స్థ‌లాల‌ను, ఇత‌ర ఆస్తుల‌ను త‌న‌ఖా పెట్టుకుని ఇచ్చేవి సెక్యూర్డ్ లోన్స్‌. అలా కాకుండా ఇచ్చేవి అన్ సెక్యూర్డ్ లోన్స్‌. ప‌ర్స‌న‌ల్ లోన్లు ఇదే కోవ‌కు చెందుతాయి. క్రెడిట్ కార్డుల‌ను కూడా అన్ సెక్యూర్డ్ లోన్స్ కింద‌నే భావిస్తారు. అయితే సెక్యూర్డ్ లోన్ తీసుకోవాల‌నుకునే వారికి అందుబాటులో ఉన్న ఆప్ష‌న్ల‌లో ఎఫ్డీపై లోన్ కూడా ఒక‌టి. అనేక బ్యాంకులు ఎఫ్డీల‌పై ఆక‌ర్ష‌ణీయ‌మైన లోన్ ఆఫ‌ర్ల‌ను అందిస్తుంటాయి. ఈ క్ర‌మంలో ఎస్‌బీఐలో ఎఫ్డీపై లోన్ ఎంత మేర పొంద‌వ‌చ్చు. ఈ లోన్‌కు గాను కాల ప‌రిమితి ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ఎఫ్డీపై 90 శాతం మేర గ‌రిష్టంగా లోన్ పొందే సౌక‌ర్యాన్ని ఎస్‌బీఐ అందిస్తోంది. అంటే మీరు రూ.1 ల‌క్ష ఎఫ్డీ చేస్తే రూ.90వేల వ‌ర‌కు లోన్ ఇస్తార‌న్న‌మాట‌. ఇక ఈ లోన్‌కు గాను కాల ప‌రిమితి గ‌రిష్టంగా 60 నెల‌ల వ‌ర‌కు ఉంటుంది. ఎఫ్డీ మొత్తంపై 10 శాతాన్ని మార్జిన్‌గా బ్యాంకు త‌న ద‌గ్గ‌రే పెట్టుకుంటుంది. మిగిలిన 90 శాతాన్ని లోన్‌గా అందిస్తుంది. కొన్ని బ్యాంకులు 85 శాతం వ‌ర‌కే లోన్లు ఇస్తుంటాయి. 15 శాతాన్ని మార్జిన్‌గా పెట్టుకుంటాయి. రుణ కాల ప‌రిమితి మాత్రం గ‌రిష్టంగా చాలా బ్యాంకులు 60 నెల‌ల వ‌ర‌కు అందిస్తున్నాయి. క‌నిష్టంగా 6 నెల‌ల వ‌ర‌కు ఇస్తాయి.

what are the rules for getting loan on fixed deposit

అయితే ఎఫ్డీపై లోన్ తీసుకునే వారు ఓవ‌ర్ డ్రాఫ్ట్ స‌దుపాయాన్ని పొందితే మంచిది. ఎందుకంటే లోన్ అయితే మీరు తీసుకున్న మొత్తంపై వ‌డ్డీ వేస్తారు. అదే ఓవ‌ర్ డ్రాఫ్ట్ అయితే కేవ‌లం మీకు అవ‌స‌రం ఉన్న మొత్తం మాత్ర‌మే తీసుకుంటారు క‌నుక దానికి మాత్ర‌మే వ‌డ్డీ చెల్లిస్తే చాలు. పైగా ఓవ‌ర్ డ్రాఫ్ట్ అకౌంట్‌ను ఎలాంటి ఇబ్బంది లేకుండా క్లోజ్ చేయ‌వ‌చ్చు.

Admin

Recent Posts