lifestyle

మ‌హిళ‌ల‌కు సంబంధించి పురుషులు తెలుసుకోవాల్సిన కొన్ని ర‌హ‌స్యాలు ఇవే..!

మ‌హిళ‌ల మ‌న‌సును అర్థం చేసుకోవ‌డం చాలా క‌ష్టం అని పురుషులు భావిస్తుంటారు. మ‌హిళ‌ల‌ను అస‌లు అర్థం చేసుకోలేమ‌ని అనుకుంటూ ఉంటారు. కానీ స్త్రీ లేదా పురుషుడు ఎవ‌రైనా స‌రే కొన్ని సూచ‌న‌లు పాటిస్తే ఎదుటి వారి మ‌న‌సులో ఏముందో సుల‌భంగా తెలుసుకోవచ్చు. స్త్రీల విష‌యంలో పురుషులు ఎటూ తేల్చుకోలేక‌పోతుంటే కొన్ని చిట్కాల‌ను పాటించాలి. స్త్రీల‌కు సంబంధించి ప‌లు ముఖ్య‌మైన ర‌హ‌స్యాల‌ను ఇవి తెలియ‌జేస్తాయి. దీంతో పురుషులు స్త్రీల‌ను సుల‌భంగా అర్థం చేసుకోగ‌లుగుతారు. ల‌వ‌ర్స్, లేదా దంప‌తుల మ‌ధ్య క‌ల‌హాలు రాకుండా ఉంటాయి.

స్త్రీ గ‌ట్టిగా అరుస్తూ మాట్లాడుతుంటే పురుషుడు వెంట‌నే ఆమెను కౌగిలించుకోవాలి. దీంతో ఆమె కోపం మొత్తం దిగిపోతుంది. కొన్ని సంద‌ర్భాల్లో స్త్రీలు బాగా ఎమోష‌న‌ల్‌కు గురైతే అలా చేస్తారు. అలాంటి సంద‌ర్భాల్లో పురుషులు ఇచ్చే ఒక్క హ‌గ్ వారిని తిరిగి నార్మ‌ల్ చేస్తుంది. క‌నుక స్త్రీలు ఆ ఎమోష‌న్స్‌లో ఉంటే పురుషులు కౌగిలించుకుంటే చాలు, వెంట‌నే కోపం పోతుంది. సాధార‌ణంగా పురుషులు ఒంట‌రిగా ఉండేందుకు ఆస‌క్తి చూపిస్తారు. కానీ స్త్రీలు త‌మ భ‌ర్త లేదా ప్రియుడితో ఉండేందుకు ఆస‌క్తిని చూపిస్తారు. క‌నుక మీ ప్రేయ‌సిని లేదా భార్య‌ను వ‌దిలి ఎక్కువ స‌మ‌యం ఉండ‌కండి. వారికి తీవ్ర‌మైన విచారం వ‌స్తుంది. దుఃఖిస్తారు. స్త్రీ మన‌స్సు పాఠ‌శాల లాంటిద‌ట‌. అంటే పురుషుడు ఆ స్కూల్‌లో ఎల్ల‌ప్పుడూ కొత్త విష‌యాల‌ను నేర్చుకుంటూనే ఉంటాడ‌ట‌.

men should know these secrets about women

కొంద‌రు పురుషులు స్త్రీల‌ను ఎల్ల‌ప్పుడూ కోప్ప‌డుతూనే ఉంటారు. అలా ఉండ‌కూడ‌దు. కోపం ఎంత చూపిస్తారో ప్రేమ కూడా అంతే చూపించాలి. అప్పుడే బంధాలు దృఢంగా ఉంటాయి. మ‌హిళ‌లు ఏ విష‌యంలో అయినా సాధార‌ణంగా ముందు ఏడ్చేస్తారు. త‌రువాత మామూలుగా అయిపోతారు. క‌నుక వారు మామూలుగా అయ్యే వ‌ర‌కు వేచి ఉండాలి. వాళ్ల‌ను మ‌రీ ఇంకా కుంగ‌దీసే ప‌నులు చేయ‌కూడ‌దు. తోటి పురుషుల‌ను ఏవైనా అంటే వారు కొద్ది రోజుల‌కు వాటిని మ‌రిచిపోతారు. కానీ స్త్రీల‌ను ఏమైనా అంటే వారు జీవితాంతం మీ మాట‌ల‌ను గుర్తు పెట్టుకుంటారు. క‌నుక స్త్రీల‌తో మాట్లాడే మాట‌ల ప‌ట్ల చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి.

Admin

Recent Posts