9 నెలల కిందటే నేను బెంగళూరు నుంచి ఓ చిన్న విలేజ్‌కు మారిపోయా. దీని వల్ల నాకు ఎంతో డబ్బు ఆదా అవుతోంది. బెంగళూరులో నేను ఖర్చు చేసిన మొత్తంలో ప్రస్తుతం 20 శాతం మాత్రమే నాకు ఖర్చవుతోంది. అంటే నేను ఎంత డబ్బు ఆదా చేస్తున్నానో మీకే స్పష్టమవుతుంది. నిజంగా చెప్పాలంటే ప్రస్తుతం బెంగళూరులో నివసించడం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారింది. బెంగళూరులో నేను ఉన్నప్పుడు నెలకు రూ.14వేలు రెంట్ కట్టేవాన్ని. వాటర్ బిల్ నెలకు రూ.250 వచ్చేది. గృహ జ్యోతి స్కీమ్ కింద కరెంటు బిల్లు కేవలం రూ.100 వచ్చేది. ఒక్కో నెల అది కూడా ఉండేది కాదు. కేవలం కరెంటు బిల్లు విషయంలో మాత్రమే మినహాయింపు.
నాకు నెలకు మొబైల్ పోస్ట్ పెయిడ్‌కు రూ.1200, వైఫైకి రూ.900, ఫుడ్, ఇతర సామాన్ల కోసం రూ.5వేలు, నీళ్లకు రూ.1200, ఆన్‌లైన్ ఫుడ్‌కు రూ.2వేలు, ఇతర ఖర్చులకు రూ.1000, ఓటీటీలకు రూ.700, ఆన్‌లైన్ సర్వీసెస్ కోసం రూ.130, మెడిసిన్ కోసం రూ.2వేలు, పొదుపు చేస్తున్న మొత్తం రూ.17వేలు అయ్యేవి. విలేజ్‌లో ఉంటున్న కారణంగా రెంట్ చాలా వరకు తగ్గింది. ఆ మొత్తాన్ని నా సేవింగ్స్‌కు మళ్లించవచ్చు. అలాగే ఓటీటీలు, ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ, ఇతర అనవసర ఖర్చులు రూ.4వేల వరకు తగ్గాయి. బెంగళూరులో ఉంటే ఖర్చు రోజు రోజుకీ అంతకంతకూ పెరుగుతూనే ఉండేది. దానిపై నియంత్రణ ఉండేది కాదు. గ్రామంలో ఉండడం వల్ల అవసరం లేని అన్ని ఖర్చులను పూర్తిగా తగ్గించా.
నగరాల్లో ప్రస్తుతం జీవించడం చాలా ఖర్చుతో కూడుకున్న పనిగా మారింది. వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం ఉంటే గ్రామాల్లో ఉంటూ పని చేసుకోవడమే ఉత్తమం. డబ్బులను చాలా ఆదా చేయవచ్చు. నగరాల్లో వేలకు వేలు అద్దె కట్టే బదులు ఆ మొత్తాన్ని సేవింగ్స్‌కు ఉపయోగించుకోవచ్చు. కచ్చితంగా డబ్బు బాగా అవుతుంది.