international

ఇబ్బందుల్లో జెట్ ఇంజిన్‌ ఒప్పందం.. ఏం జ‌రుగుతుందో చూడాలి..

Tejas MK1 యుద్ద విమానంలో మనం అమెరికా సంస్థ అయిన‌ GE వారి 404 engine ఉపయోగిస్తున్నాం. TEJAS MK2, అలాగే ప్రారంభంలో తయారు చేసే స్వదేశీ 5th gen యుద్ద విమానం బ్యాచ్ లో వినియోగించడం కోసం జరిగిన సెలెక్షన్ ప్రాసెస్ లో పాలుపంచుకున్న సంస్థలలో GE 414 engine lowest 1 bidder గా తేలింది, అలాగే అది బాగా suitable. ఈ కాంట్రాక్ట్ పొందాలి అంటే, సెలెక్ట్ అయిన సంస్థ భారత్ కి 80% సాంకేతికత transfer చేసి, ఇక్కడే వాటిని తయారు చెయ్యాలి అన్న నిబంధన ముందే ఉంచారు. భవిష్యత్తులో supply chain issues తలెత్తకుండా. ఎందుకంటే మనకి 1000 కి పైగా ఇంజిన్స్ అవసరం అవుతాయి ముందు ముందు.

L1 bidder గా GE select అయిన తరువాత , ఫైనల్ డిస్కషన్స్ సమయం లో transfer చేయవలసిన technology విషయంలో లొసుగులు వెతికి కీలకమైన సాంకేతికతను ఒప్పందంలో చేర్చకుండా ఉండే ప్రయత్నాలు చేస్తుంది ఆ సంస్థ. అందువల్ల GE మరియు HAL మధ్య జరిగిన చర్చలు ఒక కొలిక్కి రా లేదు.

jet engine contract in dilemma

ప్రత్యామ్నాయంగా, భారత్ ఫ్రెంచ్, Safran సంస్థ తో కూడా సంప్రదింపులు జరుపుతోంది. ఈ సంస్థ రఫెల్ యుద్ధ మిమనానికి ఇంజిన్స్ తయారు చేస్తుంది. వారి సహకారం తో మరో మోడల్ ఇంజన్ తయారు చేసే అవకాశం కోసం చూస్తుంది.

Crown jewel technology ఏ సంస్థా transfer చేయదు. అలా చేస్తే , ప్రత్యర్థులను పాలు పోసి పెంచడమే అవుతుంది. UPA సమయం లో L1 bidder గా తేలిన తరువాత ఫైనల్ ఒప్పందం సమయంలో Dassault కూడా ఇటువంటి లొసుగులే ముందుకి తీసుకువచ్చింది. ఇంజన్ మార్పు జరిగితే , తేజస్ MK2 ఇంకా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. చూడాలి ఏమి జరుగుతుందో!

Admin

Recent Posts