ప్ర‌శ్న - స‌మాధానం

భోజ‌నం చేసేట‌ప్పుడు మ‌ధ్య‌లో నీళ్ల‌ను తాగ‌కూడదా..? ఎందుకు..?

మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ వేళ‌కు నిద్రించ‌డం ఎంత అవ‌స‌ర‌మో స‌రైన స‌మ‌యానికి భోజ‌నం చేయ‌డం కూడా అంతే అవ‌స‌రం. కానీ చాలా మంది స‌రైన స‌మ‌యానికి భోజ‌నం చేయ‌క అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను కొని తెచ్చుకుంటున్నారు. ఉద‌యం, మ‌ధ్యాహ్నం స‌రిగ్గా టైముకు ఆహారం తీసుకుంటున్నా రాత్రి మాత్రం బాగా ఆల‌స్యం అవుతోంది. అయితే ఆరోగ్యంగా ఉండేందుకు టైముకు భోజ‌నం చేయ‌డం త‌ప్ప‌నిస‌రి అని ఆరోగ్య నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. ఇక భోజ‌నం చేసేట‌ప్పుడు చాలా మంది చేసే పొర‌పాట్ల‌లో ఒక‌టి నీళ్ల‌ను తాగ‌డం.

భోజనం మధ్యలో నీళ్లు తాగడం, లేదా తిన్న వెంటనే నీళ్లు తాగడం వల్ల జీర్ణ క్రియకు అంతరాయం కలుగుతుంది. ఇలా నీళ్లు తాగడం వల్ల ఆహారాన్ని జీర్ణం చేసే జీర్ణ రసాలు నీళ్లతో కలిసి పలుచగా మారిపోతాయి. దీంతో తిన్న ఆహారం సరిగా జీర్ణం కాదు. ఎక్కువ భాగం వ్యర్ధంగా బయటికి పోతుంది.

what happens if you drink water during meals

ఇలా నీళ్లు తాగడం వల్ల ఆహారాల్లో ఉండే పోషకాలు కూడా శరీరం గ్రహించలేదు. సరిగా జీర్ణం కాకుండా మిగిలిపోయే ఆహారాలు కొవ్వు రూపంలోకి మారిపోతాయి. ఇన్సులిన్ నిరోధకత పెరిగిపోతుంది. దీని వల్ల టైప్ 2 డయాబెటిస్ వస్తుంది. అందుకే భోజనానికి ముందు, మధ్యలో, తిన్న వెంటనే నీళ్లు తాగరాదు. కనీసం 30 నిమిషాల వ్య‌వ‌ధి అయినా స‌రే ఉండాల‌ని సూచిస్తున్నారు.

Admin

Recent Posts