international

అప్ప‌ట్లో పాక్ గ‌గ‌న‌త‌లంలోకి బ్ర‌హ్మోస్‌ను వ‌దిలిన భార‌త్‌.. పొర‌పాటున చేశారా.. కావాల‌నే చేశారా..?

పాకిస్తాన్ కి చెందిన Center for International Stratagic Studies వారు 2024 లో ఒక report publish చేశారు. అది ఇప్పుడు మళ్ళీ ప్రధాన చర్చ గా మారింది. క్లుప్తం గా దాని సారాంశం మీముందు ఉంచుతున్నాను. అందులో, మార్చి 9, 2022 లో పొరపాటున భారత్ నుంచీ వచ్చిన బ్రహ్మోస్ క్షిపణి ఘటన గురించి వారి అనాలిసిస్ చూడవచ్చు. దాని ప్రకారం ఇది పొరపాటు కాదు అని ఉద్దేశపూర్వకం గా చేసిన పని అని పాకిస్తాన్ రాడార్, రక్షణ వ్యవస్థలను పరీక్షించే ఉద్దేశం తో చేసిన పని అని అభిప్రాయం వ్యక్తం చేస్తూ కొన్ని ఆధారాలు చూపించారు.

మొదటిది, బ్రహ్మోస్ క్షిపణి pre programmed path తీసుకున్నది అని, అలాగే అది ప్రయాణిస్తున్నప్పుడు స్టేటస్ live లో ఉండటం గమనించాము అని, ఇది మిస్టేక్ కాదు కంట్రోల్డ్ టెస్ట్ అని అందుకే ఎవ్వరూ లేని ప్రాంతం లో ల్యాండ్ అయ్యింది అని తెలిపారు. రెండో ముఖ్యమైన ఆధారం, బ్రహ్మోస్ క్షిపణి ఫ్లైట్ path గమనిస్తున్నప్పుడు, అది mid flight లో sharp turn almost 90 degree turn తీసుకుంది అని అలా జరగటం mis fire అయిన missile లక్షణం కాదు అని అభిప్రాయ వ్యక్తం చేశారు. ఇలా వివరం గా ఆ రిపోర్ట్ ఉంది, అవన్నీ ఇక్కడ అప్రస్తుతం.

the real truth behind indias brahmos missile test

భారత్ మాత్రం అది mis fire అని, routine maintenance లో భాగం గా combat connectors , junction box నుంచీ విడివడకపోవడం వల్ల ఇలా జరిగింది అని, ఇంటర్నల్ enquiry తరువాత దీనికి సంబంధం ఉన్న ముగ్గురిని డిస్మిస్ చేశామని. అంతకు మించి ఇందులో ఏమీ లేదు అన్న మాటమీద ఉంది. రెండు వాదనలూ ముందు ఉన్నాయి. మనకి నచ్చింది నమ్మడమే!

Admin

Recent Posts