అవును Dairy కంపెనీలు అమ్మే పెరుగు పిండి పేస్ట్ లాగా అదో వెరైటీ గా ఉంటుంది.అది ఎందుకు ఆలా ఉంటుందంటే దానికి కారణం వాళ్ళు వాడే ఇండస్ట్రియల్ ఫెర్మెంటేషన్ టెక్నాలజీ.
మనం ఇంట్లో పెరుగు చేసేటపుడు రోజూ కొలత వేసినట్టు ఒకే క్రమ పద్దతిని ఫాలో అవ్వలేం. అంటే చేమిరి లేదా తోడు ఎంత పాలకు ఎంత వేస్తున్నాము అనేది కొంచెం అటు ఇటుగా లేదా ఎక్కువ తక్కువగా అవుతుంటుంది. పైగా మజ్జిగ వేయడం వల్ల నీళ్లు ఎక్కువగా కలుస్తాయి. తోడుకొనే సమయంలో ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రతను ఖచ్చితంగా కంట్రోల్ చేయలేము.
కానీ Dairy కంపెనీలు పాలలో ఉండే అధిక వెన్నను తీసేసి స్టాండర్డ్ వెన్న శాతం ఉండేలా మెయింటైన్ చేస్తారు. మనలాగా తోడుకు నిన్న మిగిలిన మజ్జిగానో లేక పెరుగును వేయరు. దానికోసం ప్రత్యేకమైన స్పెషల్ లాక్టిక్ యాసిడ్ బాక్టీరియా స్ట్రెయిన్స్ ను కలుపుతారు. ఇవి పెరుగును ఫెర్మెంటేషన్ చేసి నెమ్మదిగా పెరుగును గట్టిగా చేస్తాయి. పెరుగు తయారీ సమయంలో ఉష్ణోగ్రతను ఖచ్చితంగా 42°C–45°C మధ్య ఉంచుతారు. ఫెర్మెంటేషన్ 4–6 గంటలు జరుగుతుంది.
దీనికి తోడు కొన్నికంపెనీలు జెలాటిన్, కార్న్ స్టార్చ్ వంటి పదార్థాలు తక్కువ మొత్తంలో కలిపి పెరుగును మరింత thick గా చేస్తారు.