lifestyle

మ‌హిళ‌ల‌కు ఈ భాగంపై పుట్టు మ‌చ్చ ఉంటే వారి భ‌ర్త‌లు అదృష్ట‌వంతులే..!

ప్రతి ఒక్కరి విషయంలో పుట్టుమచ్చలు కీలక పాత్రనే పోషిస్తాయి. పుట్టుమచ్చలను బట్టే కొందరి జీవితాలు మారిపోతాయి. స్త్రీల విషయంలో ఈ పుట్టుమచ్చల ప్రభావం బాగా ఎక్కువగా ఉంటుంది. వీరికి ఉండే పుట్టుమచ్చల ప్రభావం పురుషులపై కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు స్త్రీలకు ఉండే పుట్టుమచ్చల వలన వారి జీవితంపై ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసుకుందాం.

స్త్రీలకు రెండు కనుబొమ్మలు కలిసే మధ్యలో పుట్టుమచ్చ ఉంటే ధనప్రాప్తి, మంచి భర్త, మంచి సంతానం కలుగుతుంది. ఎలాంటి కష్టాలు లేకుండా అందరి ప్రశంసలతో గౌరవించబడతారు.

if women have lucky spot on this part then their husbands will be lucky

స్త్రీలకు చేతిపైన గాని, నుదుటిపైన గాని ఎరుపురంగు పుట్టుమచ్చలు ఉంటే సకల శుభాలు, ఆరోగ్యం, ఐశ్వర్యం కలుగుతుంది. అలాగే నుదుటి కుడి భాగంలో పుట్టు మచ్చ ఉంటే వారి జీవితంలో అద్భుతమైన శుభాలు జరుగుతాయి. ఎడమవైపు పుట్టు మచ్చ ఉంటే సాధారణ ఫలితాలు ఉంటాయి.

ఆడవారికి ఎడమ చెక్కిలిపై పుట్టుమచ్చ ఉంటే అనంతమైన ఐశ్వర్యాలు కలిగిన సుఖాలు, భోగాలు కలుగుతాయి. అమ్మాయికి పుట్టుమచ్చ పెదాల పైభాగాన ఉంటే వారి వల్ల కుటుంబానికి మేలు జరుగుతుండటంతో పాటు అందరితో కలుపుగోలు స్వభావం ఉంటుంది. కింది పెదవిపై పుట్టుమచ్చ ఉంటే భోజన ప్రియులుగా కలిగి ఉండి మంచి మిత్రులతో కలిసి ఉంటారు. గడ్డంపైన ఉంటే నెమ్మదస్తులుగా ఉంటారు. అంతేకాదు ఆమె భర్త సంపాదన కూడా బాగా పెరిగిపోతుంది.

Admin

Recent Posts