vastu

ఏనుగు బొమ్మ‌ల‌ను మీ ఇంట్లో ఎలా పెడితే.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

ఏనుగులు పోరాట శక్తికి, సంతానోత్పత్తికి, శుభాలకి ప్రతీకలు. ఈ ఏనుగు బొమ్మల్లో కూడా తొండాన్ని పైకి ఎత్తి ఉంచిన బొమ్మ నిజంగానే అదృష్టాన్ని వెంట తీసుకుని వస్తుంది అంటున్నారు పండితులు. మన ఇంటి గేటు మీద ఏనుగు బొమ్మలు ఉంచినట్లయితే దుష్ట శక్తులు మన ఇంటి లోపలికి ప్రవేశించలేవట. అందుకే మన పురాతన దేవాలయాల్లో ప్రవేశద్వారం దగ్గర ఏనుగు బొమ్మలు పెట్టేవారు. అవి చెడు శక్తులను లోపలకి రానీయవు. అలాగే బెడ్ రూమ్ లో రెండు ఏనుగులు జతగా ఉన్న ఫోటోలు పెట్టినా దంపతుల మధ్య అన్యోన్యత పెరిగి మంచి సంతానం కలుగుతుంది.

చదువుకునే పిల్లలు ఉన్నట్లయితే ఏనుగు బొమ్మని వాళ్ళ స్టడీ టేబుల్ మీద పెడితే వాళ్లకి విజ్ఞానం పెరిగి మంచి జ్ఞాపకశక్తి కూడా వస్తుందని చాలా మంది నమ్మకం. అలాగే కొంతమంది ఇళ్ళల్లో పిల్లలు పెద్దయ్యాక చెప్పిన మాట వినకుండా వాళ్ళ ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తూ తల్లితండ్రులకి మనోవేదనను మిగులుస్తూ ఉంటారు. అలాంటి ఇంట్లో తల్లికి పిల్లలకి మధ్య సత్సబంధాలు పెరగాలంటే ఒక పెద్ద ఏనుగు దాని పిల్ల గున్న ఏనుగుతో కలిసి ఉన్న బొమ్మను గాని, ఫోటో ని గాని పెడితే మంచి ఫలితం కనిపిస్తుంది.

put elephant idols in your home like this to get rid of your problems

ఉద్యోగంలో మంచి పేరు, ప్రతిష్టలు వచ్చి స్థిరపడాలంటే ఏనుగు బొమ్మ మీద కోతి కూర్చుని ఉన్న బొమ్మ గాని ఫోటో గాని ఇంట్లో పెట్టుకోవాలట. ఇలా చెయ్యటం వల్ల ఉద్యోగంలో మంచి అభివృద్ధిని చూడగలరు.

Admin

Recent Posts