lifestyle

పీడ‌క‌ల‌లు ఎక్కువ‌గా వ‌స్తున్నాయా..? అయితే ఈ టిప్స్‌ను పాటించండి..!

కొన్నిసార్లు చెడు కలలు ఒక వ్యక్తిని ఎంతగా బాధపెడతాయంటే అది అతని దైనందిన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. నిద్రలో వచ్చిన ఈ కలలు మేల్కొన్న తర్వాత కూడా మెదడు, మనసుపై చెరగని ముద్ర వేస్తాయి. ఈ జీవిత మంత్రాలు పాటించారంటే మాత్రం చెడు కలలు మిమ్మల్ని ఎప్పుడూ బాధించవు. నిద్రపోతున్నప్పుడు కలలు రావడం సర్వసాధారణం. రకరకాల కారణాల వల్ల విభిన్నమైన స్వప్నాలు పుట్టుకొస్తాయి. కలల్లో విహరించేటప్పుడు అదంతా నిజమేనేమో అని భ్రమపడని వారు తక్కువే. అలాగే ప్రతి ఒక్కరూ తాము చూసిన కలల అర్థాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. చాలా సార్లు మనకు అస్సలు అర్థం పర్థం లేని కలలు వస్తాయి. కానీ కొన్నిసార్లు ఆ కలలు మనల్ని భయపెడతాయి. వెంటాడతాయి. నిద్రను కూడా పాడు చేస్తాయి.

ఒక వ్యక్తికి ప్రతిరోజూ పీడకలలు వస్తుటే అది అతడి దినచర్యను కూడా ప్రభావితం చేస్తుంది. మీకూ రోజూ పీడకలలు వచ్చి నిద్రకు భంగం కలుగుతున్నాయా. వాటిని ఎదుర్కోవడానికి ఈ కింది జీవిత మంత్రాలను పాటించడం అలవాటు చేసుకోండి. కమ్మటి నిద్ర పడుతుంది. ప్రతిరోజూ ఒకే సమయంలో నిద్రపోవడం, మేల్కొవడం అలవాటు చేసుకుంటే చెడు కలలు రావు. వారాంతాల్లో కూడా ఇదే అలవాటును కొనసాగించండి. పడుకునే ముందు మనసుకు ప్రశాంతత కలిగించే పనులు చేయండి. చదవడం, స్నానం చేయడం లేదా విశ్రాంతినిచ్చే సంగీతం వినడం వంటివి ఏదైనా కావచ్చు. చెడు కలలు నిద్రకు భంగం కలిగిస్తాయి. కాబట్టి దీనిని నివారించడానికి పడకగదిలో సౌకర్యవంతమైన నిద్ర వాతావరణాన్ని సృష్టించడం ముఖ్యం. గాఢ నిద్ర రావాలంటే చీకటిగా, నిశ్శబ్దంగా, చల్లగా ఉండే గదిలో పడుకోండి.

if you are getting bad dreams follow these tips

కొన్ని ఆహారాలు, పానీయాలు నిద్రకు భంగం కలిగిస్తాయి. ముఖ్యంగా నిద్రపోయే ముందు కెఫిన్, ఆల్కహాల్ అధికంగా తీసుకోవడం వల్ల నిద్రకు అంతరాయం కలుగుతుంది. ఇది పీడకలలు వచ్చే అవకాశాలను పెంచుతుంది. నిద్రపోవడానికి కనీసం ఒక గంట ముందు ఫోన్లు, ట్యాబ్లెట్లు, కంప్యూటర్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను వాడటం మానుకోండి. సోషల్ మీడియాలో వ్యాపించే వార్తలు మీ దృష్టిని మరల్చవచ్చు. వాటివల్ల పీడకలలు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ముఖ్యంగా మొబైల్ స్క్రీన్ లైటింగ్ కళ్లకు అస్సలు మంచిది కాదు. త్వరగా నిద్రపోనివ్వకుండా చేస్తుంది. పీడకలలు పదే పదే బాధిస్తుంటే డాక్టర్ దగ్గరకు వెళ్లి చికిత్స తీసుకోండి. ఎందుకంటే, జీవితంలో మనసుకు తగిలిన గాయాలు, రోజువారీ ఎదుర్కొనే ఒత్తిడి వల్ల మానసిక ఆరోగ్యం దెబ్బతిని నిద్రపై ప్రభావం పడేందుకు ఆస్కారం ఉంది.

Admin

Recent Posts