వైద్య విజ్ఞానం

ఈ అల‌వాట్లు మీకు ఉన్నాయా..? అయితే జాగ్ర‌త్త‌.. మీ మాన‌సిక ఆరోగ్యం పాడవుతుంది..!

చెడు అలవాట్లకు బానిస కావడానికి ఎక్కువ సమయం పట్టదు. తమకున్న ఈ అలవాట్ల వలన కీడు జరుగుతుందని తెలిసినా.. చాలా మంది వాటిని వదిలించుకునే ప్రయత్నం చేయరు. ఇంకా చెప్పాలంటే.. చిన్నగా, సరదాగా మొదలయ్యే కొన్ని అలవాటు దురలవాట్లుగా మారతాయి. నిద్ర లేమి, లేదా వ్యాయామానికి దూరంగా ఉండడం వంటివి ఈ చెడు అలవాట్ల జాబితాలో ఉన్నాయి. మానసిక ఆరోగ్యాన్ని పాడుచేసే అలవాట్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంట్లో ఎక్కువ సమయం గడిపే వ్యక్తులు సూర్యరశ్మిని పొందలేరు. ఇలా సూర్యరశ్మికి దూరంగా ఉండే వ్యక్తుల శరీరం, మనస్సు కూడా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. శరీరం చురుకుగా స్పందించదు. ఈ స్థితిలో డిప్రెషన్ లోకి కూడా వెళ్లే అవకాశం ఉంది.

పోర్న్ అంటే అశ్లీల వీడియోలు చూసే అలవాటున్న వ్యక్తుల మెదడు ఆరోగ్యంపై చాలా చెడు ప్రభావం చూపుతుందని చాలా పరిశోధనలు చెబుతున్నాయి. దీని కారణంగా, మెదడు రసాయన సమతుల్యత చెదిరిపోతుంది. సాధారణ జీవితంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. రోజూ వ్యాయామం చేసే వ్యక్తులు శరీరకంగానే కాదు.. మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉంటారు. యోగ, వ్యాయాయం నేర్చుకునే సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. జ్ఞాపకశక్తిని కూడా పెంచుతుంది. అందుకే రోజూ కొంతసేపైనా వ్యాయామాలు చేయాలి.

if you have these habits your mental health will be disturbed

డిజిటల్ యుగంలో ప్రజలు స్మార్ట్ ఫోన్లు లేదా ఇతర గాడ్జెట్ల వాడకానికి అలవాటు పడ్డారు. గంటల తరబడి ఫోన్‌ మాట్లాడంలోనో.. ఫోన్ లో ఆటలు, వీడియోలు చూడడం వంటి వాటిల్లో నిమగ్నమై ఉంటారు. దీంతో నిద్ర వ్యవస్థ పాడవుతుంది. నిద్ర మానేసి మరీ చూస్తూ.. ఉంటే మనసుపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. నిద్ర లేమి కారణంగా ఏకాగ్రతలో కూడా సమస్య ఏర్పడే అవకాశం ఉంది. తినే సమయంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ఆహారం మనస్సు, మానసిక స్థితి రెండింటినీ ప్రభావితం చేస్తుంది. వేయించిన లేదా ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తినడం వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది.

Admin

Recent Posts