lifestyle

ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల‌ను ధ‌రించి ల‌వ్ ప్ర‌పోజ్ చేస్తే ఓకే చెప్తారంటే..?

వాలెంటైన్స్ డే అనేది ప్రేమికుల దినోత్స‌వం. నిజానికి ఆ రోజునే కాదు, ప్రేమ‌ను వ్య‌క్త ప‌రిచేందుకు ఏదైనా స‌రైన రోజే. అందుకు ముహుర్తాలు చూడాల్సిన ప‌నిలేదు. అయితే చాలా మంది ర‌క ర‌కాలుగా త‌మ ప్రేమ‌ను తెలిపేందుకు ప్లాన్లు చేంటారు. వారి యొక్క లవర్స్ ను సప్రైజ్ చేయడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఏయే రాశులవారు ఎలాంటి కలర్ దుస్తులు ధరించి ప్రపోజ్ చేస్తే వారి ప్రేమ సక్సెస్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. మేష రాశి వారికి అంగారకుడు అధిపతి కాబట్టి ఎరుపు రంగు దుస్తులు ధరిస్తే విజయం మీదే. ఇది మీ బంధాన్ని బలపరుస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. మిథునం రాశి వారు ఆకుపచ్చ మరియు పసుపు రంగు దుస్తులు ధరించి ప్రేమ‌ను తెలిపినట్లయితే ప్రేమ విజయం ఖాయం. ఎందుకంటే ఈ రాశి పాలకుడు మెర్క్యూరీ.

వృషభ రాశి వారు గులాబీ లేదా తెలుపు రంగు దుస్తులు ధరించడం మంచిది. ఈ రాశి వారు పెళ్లి చేసుకుంటే చిన్న చిన్న సమస్యల‌కు కూడా పరిష్కారం లభిస్తుంది. సింహరాశి వారు బంగారు దుస్తులు ధ‌రించి త‌మ‌ను ప్రేమ‌ను తెల‌పాల‌ట‌. నారింజ రంగు దుస్తుల‌ను ధ‌రించినా కూడా మంచే జ‌రుగుతుంది. తుల రాశి వారు తెలుపు రంగు దుస్తుల‌ను ధ‌రించి ప్రేమ‌ను వ్య‌క్తం చేస్తే అవ‌త‌లి వారు క‌చ్చితంగా ఓకే చెప్పే చాన్స్ ఉంటుంద‌ట‌. ధ‌నుస్సు రాశి వారికి నారింజ రంగు దుస్తులు సరిపోతాయి. లేదంటే పసుపు రంగు దుస్తులను కూడా వేసుకొని ప్రపోజ్ చేసినట్టయితే మీ ప్రేమ సఫలమవుతుందని జ్యోతిష నిపుణులు అంటున్నారు.

which clothes lovers must try to make their love accepted

ఇక మిగిలిన రాశుల వారు త‌మ ఇష్టానికి అనుగుణ‌మైన లేదా త‌మ రాశి చక్రానికి అనువుగా ఉన్న రంగు దుస్తుల‌ను ధ‌రించి త‌మ ప్రేమ‌ను వ్య‌క్తం చేస్తే అంతా మంచే జ‌రుగుతుంద‌ట‌.

Admin

Recent Posts