lifestyle

హోటల్ గదిలో అమర్చిన రహస్య కెమెరాల‌ను ఎలా కనుగొనాలో తెలుసా..?

టెక్నాలజీ పెరిగిన తర్వాత మంచి కోసం కంటే చెడు కోసం ఎక్కువగా ఉపయోగిస్తున్న ఘటనలు ఇటీవల ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ హిడెన్ కెమెరాలు. హోటల్లు, థియేటర్లు, షాపింగ్ మాల్స్, హాస్టళ్లు వంటి చోట్ల రహస్య కెమెరాలు అమర్చిన ఘటనలు ఇప్పటివరకు చాలా చూశాం. తరచూ ఇలాంటి ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో కొన్ని విషయాలపై శ్రద్ధ, అప్రమత్తంగా ఉంటే మిమ్మల్ని మీరు కాపాడుకున్నట్లే. అయితే ఈ హిడెన్ కెమెరాలని ఎక్కడ అమర్చారో, ఎలా తనిఖీ చేయవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ హిడెన్ కెమెరాలు చాలా చిన్నవిగా ఉంటాయి. మీరు మీ స్మార్ట్ ఫోన్ కెమెరాను ఉపయోగించి హోటల్ గదిలో దాచిన కెమెరాలు సులభంగా మరియు త్వరగా కనుక్కోవచ్చు. ఇన్ ఫ్రారెడ్ (IR) బ్లాస్టర్లు రహస్య కెమెరాలు చీకటిలో చూడడానికి అనుమతిస్తాయి. ఈ రకమైన కెమెరాలను కనుగొనడానికి రాత్రి సమయంలో గదిలోని లైట్స్ అన్నింటిని ఆపివేయాలి. టీవీ, లాప్టాప్ మొదలైన అన్ని లైట్లు స్విచ్ ఆఫ్ చేసి కర్టెన్లు వేయాలి. గది పూర్తిగా చీకటిగా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు నైట్ విజన్ సెక్యూరిటీ కెమెరా పనితీరుతో ఉపయోగించవచ్చు. ఈ హిడెన్ కెమెరాలు ఆకుపచ్చ లేదా రెడ్ రంగు ఎల్ఈడి లైట్లు కలిగి ఉంటాయి. ఈ లైట్లు మెరుస్తూనే ఉంటాయి. ఇవి గడియారాలు, కుండీలు, అద్దాలు మరియు కెమెరాలు దాచగల ఏదైనా ఇతర వస్తువులలో అమర్చుతారు.

how to identify secret cameras in hotel rooms

ఇలా దాచిన కెమెరాల ద్వారా విడుదల అయ్యే ఇన్ఫ్రారెడ్ కాంతి మీ కెమెరా లెన్స్ నుండి కాంతి యొక్క చిన్న ఫ్లాష్ వలే కనిపిస్తోంది. ఆ ప్రాంతాన్ని నిశితంగా పరిశీలించి రహస్య కెమెరాల కోసం దగ్గరగా తనిఖీ చేయాలి. లైట్స్ ఆఫ్ చేసి కెమెరాతో వెతికినట్లయితే చీకటిలో సులభంగా కనుక్కోవచ్చు. రహస్య కెమెరాలు ఐఆర్ లైట్ ని ఉత్పత్తి చేయడం వల్ల అది కంటికి కనిపించదు. మీరు మీ ఫోన్ ను సదరు కెమెరాలు ఉన్నాయని అనుమానం కలిగిన ప్రదేశానికి దగ్గరగా తీసుకువెళ్తే దానిపై ఉన్న కెమెరా లైట్ ను మీ ఫోన్ క్యాప్చర్ చేయగలదు. దీంతో అక్కడ హిడెన్ కెమెరా ఉన్నట్లు గుర్తించవచ్చు. వాస్తవానికి హోటల్ గదులలో రహస్య కెమెరాలు ఉంచడం చట్ట విరుద్ధం.

Admin

Recent Posts