lifestyle

ఈగలు వాటి కాళ్ళను ఎందుకు రుద్దుకుంటాయో తెలిస్తే.. ఇంట్లో ఈగలను మిగలనివ్వరు..!!

సాధారణంగా మన ఇండ్లలో కాస్త అపరిశుభ్రంగా కనిపిస్తే ఈగలు, దోమలు ఇతర కీటకాలు వస్తూ ఉంటాయి. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బల్లులు, చీమలు, ఈగలు, దోమలు, సాలిడ్లు. ఇందులో కొన్ని హాని చేసేవి ఉన్నాయి. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆహార ప్రాంతాలపై వాలే ఈగలకు సంబంధించి మనకి ఎక్కువగా హాని కలిగిస్తూ ఉంటాయి. ఈగలు తమ ముందు వెనక కాలు ఎప్పుడు రుద్దుకుంటూ ఉంటాయి. సమరానికి వెళ్లే ముందు మీసం మెలేసినట్టు ఎద్దు రంకె వేసినట్టుగా ఈగలు కాళ్లు రుద్దుకుంటూ ఉండడాన్ని మీరు ఎప్పుడు గమనించలేదు.

అయితే ఇవేవో సరదాగా చేస్తాయి అనుకుంటే పొరపాటే.. ఈగలు కాళ్లను రుద్దుకోవడం వెనుక పెద్ద కథే ఉందట.. ముఖ్యంగా ఈగలు రకరకాల ఆహార ప్రాంతాలపై వాలుతూ ఉంటాయి. అంతేకాకుండా వివిధ హాని చేసే పదార్థాలపై వాలినప్పుడు వాటి కాళ్లలో బ్యాక్టీరియాలు ఉంటాయి.ఈ బ్యాక్టీరియాలను తొలగించుకోవడం కోసం ఇవి కాళ్ళను రుద్దుకుంటాయి. అంతేకాకుండా మురికి, చెత్త కూడా కాళ్ల నుంచి తొలగిపోతుంది. అంతేకాకుండా ఈగలు తమ సమాచారాన్ని ఒక దాని నుండి మరొక దానికి చేరవేసుకునేందుకు కూడా కాళ్ళను రుద్దుకుంటాయట . అలాగే ఈగల కాళ్లకు చిన్న వెంట్రుకలు ఉంటాయి. అవి సెన్సిటివ్ గా ఉంటాయి.

why flies rub their feet

ఆ వెంట్రుకలు ముట్టుకుంటే వైబ్రేషన్స్ వస్తాయి. అయితే ఈగలు తమ కాళ్లను రుద్దుకున్నప్పుడు తరంగాల రూపంలో వైబ్రేషన్స్ గాలిలోకి వెళ్తాయి. ఆ వైబ్రేషన్స్ మనకు వినపడవు కానీ ఈగలు గుర్తించగలవు. ఒక ఈగ మరో ఈగ ఎక్కడి నుంచి వైబ్రేషన్స్ ఇస్తుందో కనిపెట్టగలుగుతుంది. మనం లొకేషన్ చెప్పాలంటే మ్యాప్ లొకేషన్ పంపుతాం. కానీ ఈగ కు అంత కష్టం అక్కర్లేదు. అది కాళ్ళను రుద్దుకోవడం వల్ల లొకేషన్ చెప్పగలవు. కాళ్లను రుద్దినప్పుడు వైబ్రేషన్స్ ద్వారా ఇతర ఈగలు లొకేషన్ గుర్తించగలవు.

Admin

Recent Posts