lifestyle

పెద్ద‌ల కాళ్ల‌కు న‌మ‌స్కారం ఎందుకు చేస్తారు..? దీని వెనుక ఉన్న కార‌ణాలు ఏమిటి..?

వాట్సాప్..పేస్ బుక్.. ట్విట్టర్.. స్కైప్ ల ఈ కాలంలో మన హిందూ సంప్రదాయంలో ఉన్న చాలా పద్ధతులు కొంత మూర్ఖంగా అనిపించినప్పటికీ వాటి వెనుక ఎంతో గూడార్థం ఉంటుందనేది చాలా మంది నమ్మకం. మన ఇంట్లో పెద్దవారైన నాయనమ్మ.. తాతయ్య .. అమ్మమ్మ.. పెద్దనాన్న.. పెద్దమ్మ మరియు ఇతర పెద్దవారికి వివిధ ఫంక్షన్లలో మనము తప్పకుండా పాద నమస్కారం చేసుకొంటాము.. అలా చేసుకోవడం మన ఆనవాయితీ గా వస్తూ ఉంది. అయితే ఈ పాద నమష్కారం అనేది అసలు ఎందుకు? దాని అంతరార్ధము ఏమిటో ఇప్పుడు చూద్దాము.

మహాభారతంలో వివరించినట్లుగా మన హిందూ సంప్రదాయంలో పెద్దవారి కాళ్ళకు దండం పెట్టటం అనేది ముఖ్యమైన సంప్రదాయం.ఈ సంప్రదాయాన్ని మొదట మహాభారతంలో ధర్మరాజు ప్రారంభించాడు.మన పెద్దవారికి మనం పాదాలకు నమస్కారం చేయుట వలన ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీ ,దానితో పాటు ఒక గొప్ప అనుభూతి కలుగుతుంది. అలాగే వారి నుండి మనం అందుకునే దీవెనలు మనకి కొండత బలాన్ని ఇస్తాయి.

why we touch elders feet what is the reason

మన పెద్దవాళ్ళకి నమస్కారం చేయుట వల్ల వారి మీద గౌరవ మర్యాదలు పెరుగుతాయి దానితో పాటు మనకి వారికి మధ్య సంబంధాలు మరింత మెరుగవుతాయి.సమాజం పట్ల కూడా గౌరవ భావం పెరుగుతుంది.అలాగే మనము వంగి నమస్కరం చేయటం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. వంగటం వలన వెన్నుముకకు అది ఒక మంచి వ్యాయామంగా ఉంటుంది.

Admin

Recent Posts