lifestyle

30 దాటిన త‌ర‌వాత పెళ్లి చేసుకుంటే వ‌చ్చే 5 స‌మ‌స్య‌లు ఇవేన‌ట‌..! జాగ్ర‌త్త సుమా..!

ఒకప్పుడు పాతికేళ్లు దాటిన వెంటనే పెళ్లి చేసుకునేవారు. కానీ ఇప్పుడు 30 ఏళ్లు దాటిన పెళ్లిళ్లు చేసుకోవడానికి సిద్ధంగా ఉండటం లేదు. దానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనది నిరుద్యోగ సమస్య. ఈ సమస్య వల్ల చాలామంది లేటు వయసులో వివాహం చేసుకుంటున్నారు. ఏదో ఒక ఉద్యోగం సాధించాలని పట్టుదలతో ఏళ్ల తరబడి పుస్తకాలకు అతుక్కుపోతున్నారు. అలా వయసు పైబడిపోతుంది.

ఇక మరికొందరు 30 ఏళ్ల వరకు లైఫ్ ను ఎంజాయ్ చేసి, ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు. అలా కూడా వివాహాలు పోస్ట్ పోన్ అవుతున్నాయి. అయితే 30 ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకుంటే కొన్ని సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 30 దాటిన తర్వాత పెళ్లి చేసుకున్న చాలామంది వారి కెరీర్ పై దృష్టి పెట్టి సంసారాలను పట్టించుకోవడం లేదు. దీంతో వీరిని నమ్మి వచ్చిన జీవిత భాగస్వామికి సమస్యలు తప్పడం లేదట. ఎన్నో కలలు కంటూ జీవితంలోకి వచ్చిన సదరు అమ్మాయిని చాలా నిర్లక్ష్యం చేస్తూ జీవితంలో ఎదగడం కోసమే ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారట.

you will get these problems if you marry after 30 years

ఈ విధంగా చేస్తూ అనేక ఇబ్బందుల పాలవుతున్నారు. అయితే ఇలా చేయడం వల్ల జీవిత భాగస్వామికి అనుమానాలు అపార్ధాలు మొదలవుతాయి. ఒకరిపై ఒకరికి నమ్మకం పోతుంది. గొడవలు కూడా స్టార్ట్ అవుతాయి. ఈ విధంగా గొడవలు ముదిరి విడాకుల వరకు వెళ్లడం చాలా చూస్తున్నాం. కాని వివాహ జీవితంలో ఎదురయ్యే ఇలాంటి సమస్యలైనా తట్టుకోవలసిందే దీనికోసం భార్య భర్తలు ఇద్దరూ సమన్వయం పాటించి ఉంటేనే సంసార జీవితం సాఫీగా సాగుతుంది. లేదంటే వారి మధ్య ఆకర్షణ తగ్గి అనేక అనుమానాలకు బీజం పడుతుంది. ఈ తరుణంలో సఖ్యతగా ఉండేందుకు ఒకరికొకరు దాపరికాలు లేకుండా చూసుకోవడం చాలా మంచిది. అప్పుడే సంసార జీవితం ముందుకు పోతుంది. అది ప్రతి ఒక్కరి జీవితంలో డబ్బు సంపాదించడం ముఖ్యమే, కానీ డబ్బుతో పాటుగా జీవిత భాగస్వామి ప్రేమను కూడా పట్టించుకోవాలి.

Admin

Recent Posts