vastu

వాస్తు ప్ర‌కారం మీ ఇంట్లో గోడ గ‌డియారాన్ని ఇలా పెట్టండి.. అన్ని స‌మ‌స్య‌లు తొల‌గిపోతాయి..!

వాస్తు ప్రకారం అనుసరిస్తే ఎలాంటి సమస్యకైనా సరే పరిష్కారం దొరుకుతుంది. చాలామంది వాస్తు ప్రకారం అనుసరిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం అనుసరించడం వలన సమస్యలన్నిటికీ పరిష్కారం దొరికి చక్కగా హాయిగా ఉండొచ్చు పండితులు ఈరోజు మనతో కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాలను చెప్పారు మరి వాటి కోసమే ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో గడియారాన్ని పెడుతూ ఉంటారు గడియారం కేవలం సమయానికి కాదు వాస్తు ప్రకారం గడియారం మంచి పాజిటివ్ ఎనర్జీ ని తీసుకువస్తుంది అయితే ఇంట్లో పెండ్యులం క్లాక్ ని పెట్టుకోవడం వలన చక్కటి ప్రయోజనాలని పొందొచ్చు ఇటువంటి గడియారాలని ఇంట్లో పెట్టడం వలన సమస్యలు అన్నిటికి దూరంగా ఉండొచ్చు.

put a wall clock like this in your home as per vastu

డ్రాయింగ్ రూమ్లో ఈ పెండ్యులం క్లాక్ ని పెడితే చాలా చక్కటి ప్రయోజనాన్ని పొందవచ్చు. వాస్తు శాస్త్రం ప్రకారం గుండ్రంగా ఉండే గడియారం కోడిగుడ్డు ఆకారంలో ఉండే గడియారం 8 కోణాలు ఆరు సైడ్లు ఉండే గడియారాన్ని పెట్టుకోవచ్చు ఇవి పాజిటివ్ ఎనర్జీని కలిగిస్తాయి నెగిటివ్ ఎనర్జీ తొలగిస్తాయి ఆనందంగా ఉండొచ్చు. సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది.

ఇంట్లో గడియారం ఎప్పుడు కూడా తిరుగుతూనే ఉండాలి ఆగిపోయిన గడియారాలని విరిగిపోయిన గడియారాలని పని చేయని గడియారాలని అసలు ఇంట్లో ఉంచకూడదు. వీటి వలన నెగటివ్ ఎనర్జీ కలుగుతుంది కాబట్టి తప్పులు జరగకుండా చూసుకోండి అప్పుడు ఆనందంగా ప్రశాంతంగా ఉండొచ్చు గడియారం విషయంలో ఇలాంటి తప్పులు జరగకుండా ఉంటే చక్కటి ప్రయోజనాన్ని పొందవచ్చు.

Admin

Recent Posts