వైద్య విజ్ఞానం

పాల‌కూర‌తో దీన్ని క‌లిపి తింటున్నారా.. అయితే జాగ్ర‌త్త, లేని పోని స‌మ‌స్య‌లు వ‌స్తాయి..

పాలక్‌ పన్నీర్‌… ఇది చాలా మంది ఫేవరెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిష్‌ లిస్ట్‌‌లో కచ్చితంగా ఉంటుంది. రోటీ, నాన్‌, చపాతీ.. దేనిలోకైనా పాలక్‌ పన్నీర్‌ బెస్ట్‌‌ కాంబినేషన్‌. పిల్లలు కూడా.. లంచ్‌ బాక్స్‌లో పాలక్‌ పన్నీర్‌ ఉంటే మారు మాట్లాడకుంటే.. బాక్స్‌ ఫినిష్‌ చేస్తారు. పాలక్‌ పన్నీర్‌ చేయడానికి వాడే మెయిన్‌ ఇంగ్రీడియంట్స్‌.. పాలకూర, పన్నీర్‌లోనూ పోషకాలు పష్కలంగా ఉంటాయి. పన్నీర్‌లో ప్రోటీన్‌, విట‌మిన్ బి, విట‌మిన్ ఎ, విట‌మిన్ ఇ, సెలీనియం, కాల్షియం, సోడియం, పాటాషియం, ఫాస్ప‌ర‌స్‌, జింక్, యాంటీ ఆక్సిడెంట్స్ వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. పాలకూరలో విట‌మిన్‌ ఎ, సి, కె , మెగ్నీషియం, ఐరన్‌, విటమిన్‌-ఏ,సి, కె. వంటివి మెండుగా ఉంటాయి. ఫోలిక్‌ యాసిడ్‌ , ఫైటో న్యూట్రియెంట్లు, ఐర‌న్‌ వంటి పోషకాలు ఉంటాయి. ఈ పోషకాల కారణంగా.. పాలక్‌ పన్నీర్‌ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని చాలా మంది అనుకుంటారు.

కానీ, పాలకూర, పన్నీర్‌ కలిపి తినకూడదని నిపుణులు చెబుతున్నారు. ఈ కాంబినేషన్‌ వల్ల ఐరన్‌ లోపం వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు. పాలకూర, పన్నీర్‌ కలిపి ఎందుకు తినకూడదో.. ప్రముఖ డైటీషియన్‌ నమామి అగర్వాల్ మనకు వివరించారు. పాలకూర, పన్నీర్‌ కాంబినేషన్‌ ఆరోగ్యానికి మంచిది కాదని డైటీషియన్‌ నమామి అగర్వాల్ అన్నారు. ఈ కాంబినేషన్‌ కారణంగా.. పాలకూరలోని పోషకాలు నాశనం అవుతాయని వివరించారు. పాలక్‌ పన్నీర్‌ కలిపి తింటే.. మన శరీరానికి ఐరన్‌, కాల్షియం కలిసి అందుతాయి. కాల్షియం కారణంగా, శరీరం ఐరన్‌ను గ్రహించుకోలేదు. దీంతో శరీరానికి ఐరన్‌ అందదు. మనం తీసుకున్న ఐరన్‌ వృద్ధా అవుతుంది. పాలకూర, పన్నీర్‌ కాంబినేషన్‌ వల్ల ఐరన్‌ లోపం వచ్చే అవకాశం ఉంది. పనీర్‌కు బదులుగా పాలకూర – బంగాళదుంప, పాలకూర – కార్న్‌ తీసుకోండి.

do not take palak and paneer together you will get these problems

ఈ కాంబినేషన్స్‌తో పాలకూరలోని పోషకాలు శరీరానికి అందుతాయి. మనం ఆరోగ్యంగా ఉండటానికి.. పోషకాహారం తీసుకుంటేనే సరిపోదని, సరైన కాంబినేషన్స్‌ కూడా తెలుసుకోవాలని నమామి అగర్వాల్ ‌అన్నారు. కొన్ని ఆహార పదార్థాలలో ఉండే పోషకాలు.. వేరే ఆహారంలోని పోషకాలు శరీరం గ్రహించకుండా అడ్డుకుంటాయని వివరించారు. పాలక్‌ పన్నీర్‌ కాంబినేషన్‌ ఎక్కువగా తింటే.. కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉందని డైటీషియన్‌ నమామి అగర్వాల్‌ హెచ్చరించారు. పాలకూరలో ఆక్సాలిక్ యాసిడ్‌ ఉంటుంది, ఇది పన్నీర్‌లోని కాల్షియం.. శరీరం గ్రహించకుండా అడ్డుకుంటుంది. ఈ కాల్షియం కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది. క్యాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాన్ని పాలకూరతో కలిపి తినకూడదని డైటీషియన్‌ నమామి అగర్వాల్‌ సూచించారు. పాలకూరతో పెరుగు, పాలు, టోఫు తీసుకోకూడదు.

Admin

Recent Posts