వైద్య విజ్ఞానం

మీకు త‌ర‌చూ గుండెల్లో ద‌డ‌గా ఉంటుందా.. అయితే అందుకు కార‌ణాలు ఇవే..!

మామూలుగా గుండె యొక్క స్పందనలను మనం గుర్తించలేము. గుండెదడను ఆంగ్లంలో పాల్పిటేషన్స్ అని వ్యవహరిస్తారు. గుండె దడ అనగా తన గుండె తనలో వేగముగా కొట్టుకొంటున్నట్లు తోచుట. సాధారణంగా ఆందోళనగా ఉన్నప్పుడు, వ్యాయామం తరువాత కొందరిలో ఇది కొంతసేపు ఉంటుంది. గుండెదడ చాలాకాలంగా నిరంతరంగా కొనసాగేటట్లయితే దానివలన వచ్చే వ్యాధుల గురించి ఆలోచించాలి. వైద్యులను సంప్రదించి, మొదటి దశలోనే తగిన చికిత్స చేయించుకోవాలి. గుండెదడకు కారణాలు పరిశీలించండి.

మానసిక ఒత్తిడి : మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురైన సమయంలో గుండెదడ వస్తుంది. రక్తహీనత : దీనివలన శరీర కణజాలానికి ప్రాణవాయువు సరఫరా తగ్గి, దానిమూలంగా ఆయాసం, గుండెదడ వస్తాయి. ముఖ్యంగా అధిక శ్రమ చేసినప్పుడు వీటిలో గుండెనొప్పి కూడా వచ్చే అవకాశం వుంటుంది. విటమిన్ లోపాలు : విటమిన్ బి లోపం వల్ల వచ్చే బెరిబెరి అనే వ్యాధిలో కూడా గుండెదడ రావచ్చు. థైరాయిడ్ గ్రంధి వ్యాధులు : థైరాయిడ్ గ్రంధి ఎక్కువగా పనిచేసే హైపర్ థైరాయిడిజం లో అనూహ్యమైన రీతిలో బరువు తగ్గి, విరేచనాలు, ఆకలి ఎక్కువగా వేయడం, గుండెదడ కనిపిస్తాయి.

if you have heart palpitations then know the reasons

మెనోపాజ్ సమస్యలు : కొందరు స్త్రీలలో బహిష్టులాగిపోయే దశలో హార్మోన్ ల విడుదలలో లోపం ఏర్పడడం వలన రక్తప్రసరణ గతి తప్పి గుండెదడ ఏర్పడుతుంది. మందుల దుష్ఫలితాలు : ఉబ్బసం కోసం వాడే కొన్ని మందులు గుండెదడను కలిగించే అవకాశం వుంది. గుండె జబ్బులు : గుండె కవాటాలు వ్యాధిగ్రస్తమవడం, గుండె కండరాలు బలహీనమవడం వంటి స్థితులలో గుండెదడ రావచ్చు.

Admin

Recent Posts