వైద్య విజ్ఞానం

కొవ్వును క‌రిగించడ‌మా.. బ‌రువును త‌గ్గించ‌డ‌మా..? ఏది ముఖ్యం..?

నేటి రోజుల్లో చాలామంది లావుగా వుండటం, వారు సన్నపడిపోవాలని ఏదో ఒక ప్రయత్నం చేయటం, బరువు తగ్గుతానని భావిస్తూండటం జరుగుతోంది. వీరు సాధారణంగా ఈ అంశాలు పేపరు ప్రకటనలు, సెలిబ్రటీల ప్రకటనలనుంచి ఈ రకమైన వాటికి మొగ్గుచూపుతారు. అయితే, ఇవి సరైనవేనా, వాస్తవ ఫలితాలనిస్తాయా? అనేదానికి కొన్ని వాస్తవాలు పరిశీలించండి. కొన్నిమార్లు ఎంత కష్టపడినప్పటికి బరువు తగ్గరు. మరి కొన్ని మార్లు చిన్నపాటి చిట్కా వ్యాయామాలతో బరువు తగ్గుతారు.

శరీరంలో అధికభాగం కొవ్వు చేరి లావెక్కామా? లేక కార్బోహైడ్రేట్ల కారణంగా లావెక్కామా అని ఆలోచన చేయకండి. మీ శరీర జీవప్రక్రియ ఎలా సాగుతోందనేది మీరు గ్రహించండి. మీరు చేసే వ్యాయామాలు మీ జీవప్రక్రియను అధికం చేస్తే వాటిని కొనసాగించండి. మరి కొంతమంది నడకపాటి తేలిక వ్యాయామం తీవ్రంగా చేసే వ్యాయామాలకంటే కూడా ఎక్కువ ప్రభావం చూపుతుందనుకుంటారు. అది నిజమే. అయితే, తేలికపాటి నడక వంటివాటిలో శరీరం శ్రమకు గురికాదు.

weight loss or fat reduction which one is effective

కనుక తీవ్రత అధికమైన వ్యాయామాలు ఎక్కువ కొవ్వు కరిగించి ఆకలి పుట్టించేలా చేస్తాయి. అధిక తీవ్రత కల వ్యాయామాలు కొవ్వును త్వరగా కరిగిస్తాయి. వాస్తవంగా 15 నుండి 20 నిమిషాలు ఈ రకం వ్యాయామం చేస్తే కొవ్వు బాగా కరుగుతుంది కానీ బరువు తగ్గరు. కొవ్వు కరగటం కూడా కాదు బరువు తగ్గటమనేది వ్యాయామ లక్ష్యంగా వుండాలి.

Admin

Recent Posts