వైద్య విజ్ఞానం

వామ్మో.. ఫోన్‌ని వాడ‌డం వ‌ల్ల ఇన్ని న‌ష్టాలు ఉన్నాయా..?

చాలామంది ప్రతిరోజూ స్మార్ట్ ఫోన్ ని ఉపయోగిస్తూ ఉంటారు. నిజానికి మొబైల్ ఫోన్ వలన చాలా సమస్యలు కలుగుతాయి మొబైల్ ఫోన్ వలన కలిగే నష్టాలు చూస్తే మీరు కచ్చితంగా షాక్ అయిపోతారు. ఇన్ని సమస్యలు స్మార్ట్‌ఫోన్ వల్ల కలుగుతాయని చాలా మందికి తెలియదు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా స్మార్ట్ ఫోన్ బాగా అలవాటు అయిపోయింది. చాలామంది ఫోన్ కి ఎడిక్ట్ అయిపోతున్నారు. ఎప్పుడు చూసినా ఫోన్ లోనే ఉంటున్నారు. కానీ చాలామంది అనుకుంటారు ఫోన్ వలన కేవలం కంటి చూపు మాత్రమే దెబ్బతింటుందని.. వాళ్ళకి తెలియని విషయం ఏమిటంటే ఫోన్ వలన చాలా సమస్యలు వస్తాయి మరి అవి ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు చూసేద్దాం..

ఫోన్ స్క్రీన్ లైట్ వల్ల రకరకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఫోన్ స్క్రీన్ కారణంగా కళ్ళు ఆరిపోవడం, కంటి చూపు తగ్గడం, కళ్ళు ఎర్రగా మారడం వంటివి కలుగుతాయి. ఫోన్ నోటిఫికేషన్ ని ఆపేసుకుంటే ఫోన్ మీద ధ్యాస తగ్గిపోతుంది అలానే ఎప్పుడు కూడా ఉదయం లేచిన వెంటనే ఫోన్ చూడకండి. ఉదయం లేచిన వెంటనే మీరు ఫోన్ చూడడం వలన రోజు మీద ఫోకస్ చేయలేరు బద్దకంగా మారిపోతారు పనిమీద అసలు ధ్యాస వెళ్లదు. సమయాన్ని అనవసరంగా వృధా చేసుకుంటారు. పైగా ఉదయాన్నే ఫోన్ చూడటం వలన బద్ధకం వచ్చేస్తుంది దాంతో మంచం కూడా దిగాలని అనిపించదు ఉదయం లేచిన వెంటనే వర్క్ అవుట్ చేయండి. మీ మనసుని మీ శరీరాన్ని చక్కగా ఆరోగ్యంగా ఉంచుకోండి.

side effects of using smart phones

ఫోన్ ఎక్కువగా ఉపయోగించడం వలన ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.. ఇరిటేబులిటీ, కోపం, రోజువారి పనులు చేయలేకపోవడం, కంటి చూపు తగ్గడం, చెవుడు రావడం, మానసికంగా బలహీనంగా అయిపోవడం, శారీరకంగా బలహీనంగా అయిపోవడం, వెర్టిగో, నరాల బలహీనత, సర్వికల్ సమస్యలు వ‌స్తాయి. క‌నుక రోజులో వీలైనంత వ‌ర‌కు ఫోన్ వాడ‌కాన్ని త‌గ్గిస్తే మంచిది.

Admin

Recent Posts