సాధారణంగా పెద్దవారిలో వచ్చే షుగర్ వ్యాధిని టైప్ 2 డయాబెటీస్ అంటారు. ఇది ఒక జీవక్రియ రుగ్మతగా భావించాలి. ఇన్సులిన్ పవర్ తగ్గిపోవటంతో, లేదా చాలకపోవటంతో శరీరంలోని రక్తంలో అధిక గ్లూకోజు నిల్వల కారణంగా ఏర్పడుతుంది. దీని లక్షణాలు దాహం వేయటం, తరచుగా మూత్రం పోయటం, ఎపుడూ ఆకలిగా వుండటం ప్రధానంగా వుంటాయి. టైప్ 2 డయాబెటీస్ కు కారణం వంశానుగతంగా లేదా ఎవరికి వారికే వచ్చే అధికబరువుగా చెప్పవచ్చు.
డయాబెటీస్ లో టైప్ 2 డయాబెటీస్ 90 శాతంగా వుంటుంది. టైప్ 1 డయాబెటీస్ అంటే ఇన్సులిన్ తీసుకునే అవసరం వున్నది, లేదా గర్భవతులకు వచ్చే జెస్టేషనల్ డయాబెటీస్ రెండూ చేరి 10 శాతంగా వుంటుంది. టైప్ 2 డయాబెటీస్ ను ప్రధమంలో వ్యాయామం, ఆహార మార్పుల ద్వారా తగ్గించుకోవచ్చు. ఈ చర్యలవలన బ్లడ్ షుగర్ తగ్గకపోతే మెట్ ఫార్మిన్ లేదా ఇన్సులిన్ అవసరమవుతాయి. ఇన్సులిన్ వారిలో క్రమం తప్పకుండా షుగర్ లెవెల్స్ పరీక్షించాల్సిన అవసరం వుంటుంది.
డయాబెటీస్ రోగుల సంఖ్య గత 50 సంవత్సరాలలో అధిక బరువు సమస్యతో సమానంగా వుంటోంది. 2010 సంవత్సరం నాటికి సుమారుగా 285 మిలియన్ల జనాభా ఈ వ్యాధిన పడ్డారు1985 వరకు 30 మిలియన్లమంది మాత్రమే వుండేవారు. షుగర్ వ్యాధి దీర్ఘ కాలం వుంటే, గుండె పోట్లు, డయాబెటిక్ రెటినోపతితో దృష్టి మందగించటం, కిడ్నీ విఫలమై డయాల్సిస్ చేయాల్సి రావటం, అవయవాలలో రక్త ప్రసరణ సరిగా లేక వాటిని తొలగించే పరిస్ధితి ఏర్పడటం వంటివి వుంటాయి. వీరికి హైపో గ్లైసీమియా అంటే లోషుగర్ వంటి పరిస్ధితికూడా ఏర్పడుతుంది.