పోష‌ణ‌

ఈ సీజ‌న్‌లోనే కనిపించే కాయ‌లు ఇవి.. విడిచిపెట్ట‌కుండా తినండి..!

వానా కాలంలో ఆకాకరకాయలు తీసుకోవడం వలన అనేక రకాల అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి. చాలామంది వీటిని తినేందుకు ఇష్టపడతారు. ఆకాకరకాయ వేపుడు వంటి రెసిపీస్ ని రుచిగా తయారు చేసుకుని మనం తీసుకోవచ్చు. పోషకాలతో నిండిన ఆకాకరకాయని తీసుకుంటే చాలా రకాల సమస్యలకు దూరంగా ఉండొచ్చు అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు మరి ఇక ఎలాంటి లాభాలు అన్ని పొందొచ్చు అనే విషయాన్ని చూద్దాం.

ఆకాకరకాయని వానా కాలంలో తీసుకుంటే ఇన్ఫెక్షన్లకి దూరంగా ఉండొచ్చు ముఖ్యంగా జలుబు ఫ్లూ వంటి బాధలు ఉండవు. ఊబకాయం కి సంబంధించిన ఫ్యాటీ లివర్ సమస్యకు కూడా దూరంగా ఉండొచ్చు. యాంటీ ఇంఫ్లమేటరీ గుణాలు, యాంటీ మైక్రోబియల్ గుణాలు కూడా ఆకాకరకాయలో సమృద్ధిగా ఉంటాయి ఆకాకరకాయని తీసుకోవడం వలన ఫైబర్ తో పాటుగా విటమిన్ ఏ విటమిన్ సి మినరల్స్ కూడా పుష్కలంగా లభిస్తాయి.

do not forget to take spiny gourd in this season

అందుకని ఆరోగ్య నిపుణులు ఆకాకరకాయ ని వానా కాలంలో తీసుకుంటే మంచిదని అంటున్నారు. ఇందులో పొటాషియం మెగ్నీషియం ఐరన్ కూడా అధికంగా ఉంటాయి కాబట్టి ఇది దొరికినప్పుడు మీరు వండుకుని డైట్లో చేర్చుకుంటే మంచిది. ముందు వీటిని శుభ్రం చేసుకుని ముక్కలు కింద కట్ చేసుకుని.. ఆవాలు కరివేపాకు పచ్చిమిర్చి నూనెలో వేయించి ఉల్లిపాయలు కూడా వేయించి ఉప్పు పసుపు కారం వేసుకుని వీటిని అందులో వేసి ఉడికించుకుంటే సరిపోతుంది.

Admin

Recent Posts