పోష‌ణ‌

స‌న్నబ‌డాల‌న్నా, షుగ‌ర్‌ను తగ్గించుకోవాల‌న్నా.. వీటిని తినండి..!

సన్నబడాలని ప్రయత్నం చేసేవారు వారి ఆహారంలో చిక్కుళ్లను భాగం చేసుకోవాలి. ఎందుకంటే చిక్కుడులో బోలెడు సుగుణాలున్నాయి. ప్రతి వందగ్రాముల చిక్కుడు కాయల్లో 48 క్యాలరీల శక్తి ఉంటుంది.

శరీరం బరువు తగ్గాలని డైటింగ్‌ చేసేవారు చిక్కుడును ఎక్కువగా తింటే మంచిది. అరకప్పు చిక్కుడులో 7 గ్రాముల ప్రోటీన్లు లభిస్తాయి. చిక్కుడును కూరల్లోనే కాకుండా సూప్స్, ఇతర టిఫిన్ల తయారీలో కూడా ఉపయోగించవచ్చు. ఇందులో బీ-కాంప్లెక్స్‌లోని ఎనిమిది రకాల విటమిన్లు కూడా లభిస్తాయి.

take broad beans regularly to reduce weight and control diabetes కాలేయం, చర్మం, కళ్లు, వెంట్రుకలు వంటి భాగాలకు చిక్కుడు చక్కటి శక్తిని అందిస్తుంది. అలాగే మధుమేహ రోగులు అన్నంకన్నా చిక్కుడు శాతం ఎక్కువగా తీసుకుంటే 25 శాతం డయాబెటిస్‌ను నియంత్రించవచ్చని తాజా అధ్యయనంలో తేలింది.

చిక్కుడును వారంలో కనీసం మూడుకప్పులు తినగలిగితే ఆరోగ్యానికి ఎంతో మేలు. చిక్కుడులో ఉండే పీచు, యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో తయారయ్యే క్యాన్సర్‌ కారకాలతో పోరాడుతాయి. గుండె ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తాయి. గుండెచుట్టూ కొలెస్టరాల్‌, ట్రైగ్లిజరైడ్స్‌ పెరగకుండా చూస్తాయి.

Admin

Recent Posts