పోష‌ణ‌

మీ చ‌ర్మం ఎల్ల‌ప్పుడూ య‌వ్వ‌నంగా క‌నిపించాలంటే వీటిని తీసుకోండి..!

చర్మానికి మంచి ఆహారం అవసరం. చర్మ సంబంధిత సమస్యలు రాకుండా వుండాలంటే విటమిన్లు కల ఆహారం తినాలి. జంక్ ఆహారం వదలాలి. పోషకాలు కల ఆహారం తింటే, వైద్యపర వ్యయం తొలగించుకోవచ్చు. మరి చర్మం కొరకు తినాల్సిన ఆహారాలేవో చూడండి. చర్మ సంబంధిత వ్యాధులకు గ్రీన్ టీ మంచి పానీయం. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా వుంటాయి. ఇవి చర్మ కణ పొరలను కాపాడతాయి. అల్ట్రా వయోలెట్ కిరణాలనుండి కాపాడతాయి. స్కిన్ కేన్సర్ రాకుండా కాపాడతాయి.

చేప‌లు.. ఇది ఫ్యాటీ యాసిడ్లు అధికంగా వుండే ఆహారం. చర్మ రక్షణకు మంచిది. ఇందులో వుండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు విట‌మిన్ కొరతను తొలగించి పొటాషియం, ప్రొటీన్లు, సెలీనియం లభించేలా కూడా చేస్తుంది. బ్లూబెర్రీలు యాంటీ ఆక్సిడెంట్లు కలిగి వుంటాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్‌ను అరికడతాయి. శరీర కణాలు డ్యామేజీ కాకుండా కాపాడతాయి. బ్లూబెర్రీలు తింటే ఎప్పటికి చిన్నవారుగానే కనపడతారు.

take these foods for skin health to be young always

కేరట్లు మంచి పోషకాలు కలిగివుండే ఆహారాలు. విటమిన్లు అధికం. చర్మం సంరక్షణకు మంచి ఆహారం. ఇందులో వుండే విటమిన్ ఎ చర్మం పొడిబారకుండా చేస్తుంది. ఇందులో వుండే పీచు, పొటాషియం, ధయామైన్ వంటివి చర్మానికి మేలు చేస్తాయి. నీరు చర్మానికి అత్యవసరం. నీరు మీ శరీరంలో ఎపుడూ వుంటే మీకు శక్తి చేకూరుస్తుంది. చిన్నవారుగాను, మెరిసే చర్మంతోను కనపడతారు.

Admin

Recent Posts