తాజ్‌మహల్.. ప్రపంచంలోని 7 వింతల్లో ఇది కూడా ఒకటి. ముంతాజ్ కోసం షాజహాన్ కట్టించిన ప్రేమ మందిరం. ఇప్పుడు గొప్ప పర్యాటక ప్రదేశంగా గుర్తింపు పొందింది. అనేక మంది పర్యాటకులు విదేశాల నుంచి కూడా తాజ్ మహల్ అందాలను వీక్షించేందుకు వస్తుంటారు. అయితే విదేశాల నుంచి వచ్చినా, దేశీయులైనా కేవలం బయటకు కనబడే తాజ్ మహల్‌ను మాత్రమే చూస్తారు. కానీ మీకు తెలుసా..? నిజానికి తాజ్ మహల్‌లో మనకు తెలియని ఇంకా ఎన్నో రహస్యాలు ఉన్నాయని. అవును, మీరు విన్నది నిజమే. తాజ్ మహల్ లో భూగర్భంలో ఎన్నో గదులు రహస్యంగా ఉన్నాయట. కానీ వాటిల్లోకి మనకు ప్రవేశం లేదు. అయితే ఈ రహస్య గదుల గురించి ప్రచారంలో ఉన్న పలు విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
తాజ్‌మహల్ లో ఉన్న పలు ఆర్చిల వెనుక చతురస్రాకారంలో సొరంగ మార్గాలు ఉన్నాయట. వాటి గుండా వెళితే రహస్య గదుల్లోకి వెళ్లవచ్చట. అలా వెళితే ఏకంగా 1089 గదులు వస్తాయట. అయితే వాటిలోకి వెళితే మళ్లీ తిరిగి రావడం చాలా కష్టతరమవుతుందట. ఎందుకంటే అవన్నీ అంతటి పద్మవ్యూహంలా ఉంటాయట మరి. ఆ గదులలోకి ఎవరూ వెళ్లకూడదని వాటిని ఇటుకలు, రాళ్లతో సీజ్ చేశారట. అవన్నీ చాలా గాఢాంధకారంలో ఉంటాయట. ఆ గదుల్లోకి వెళ్లేందుకు ఎవరూ సాహసం చేయలేరట. ఇక ఆ గదుల్లో ఉన్న పలు ఆర్చిలకు ఒక్కో కథ ఉందట.
ఇక ముంతాజ్ సమాధి ఉన్న భాగంలో కింద ఓ పురాతన శివాలయం ఉండేదని, అయితే దాన్ని కవర్ చేస్తూ షాజహాన్ తాజ్ మహల్ నిర్మించాడని కొందరు చెబుతారు. ఆ సమాధి కింది భాగంలో లోపలికి పెద్ద సొరంగ మార్గం ఉందని అందులో పురాతన విగ్రహాలు ఉన్నాయని కొందరు చెబుతారు. అదేవిధంగా డాక్టర్ గాడ్‌బోల్ అనే రచయిత ఏం చెబుతున్నాడంటే అసలు తాజ్ మహల్‌ను షాజహాన్ కట్టలేదని, దాన్ని కట్టింది రాజా మాన్‌సింగ్ అని చెబుతున్నారు. ఇక కొందరైతే తాజ్ మహల్ లో ఉన్న రహస్య గదులు ఖాళీగా ఉండేవని, అందుకే వాటిని మూసేసి ఉంటారని అంటున్నారు. అయితే ఇప్పటి వరకు తాజ్ మహల్ లో రహస్య గదులు ఉన్నాయని ఎవరూ నిర్దారించలేదు. అయినా ఏమో.. అనంత పద్మనాభ స్వామి గుడిలో నేలమాళిగలు బయట పడినట్టు తాజ్ మహల్‌లోనూ రహస్య గదులు బయట పడతాయేమో..! చూద్దాం.. తెలుస్తుంది..!