పోష‌ణ‌

మీ ఏజ్‌ అంత దాటిందా..? రోజూ కోడిగుడ్డు తినండి.. లేదంటే హాస్పిటల్‌కి వెళ్లక తప్పదు..

కోడిగుడ్డును సంపూర్ణ ఆహారంగా చెబుతారు. ఒక గుడ్డు తినడం వల్ల శరీరానికి అవసరమయ్యే చాలా పోషకాలు ఒకేసారి అందుతాయి. అందుకే రోజుకో గుడ్డు తినమని సిఫారసు చేస్తున్నాయి అధ్యయనాలు. నలభై ఏళ్లు వయసు దాటిన చాలా మంది గుడ్డులో కొలెస్ట్రాల్ ఉంటుందని చెబుతూ తినడం మానేస్తున్నారు. కానీ ఆరోగ్యకరమైన జీవితానికి సమతుల్య ఆహారం చాలా అవసరం. అందుకు కోడిగుడ్డు తినడం కూడా ముఖ్యం. మారిన జీవన శైలి పరిస్థితుల కారణంగా ఇప్పటి రోజుల్లో ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఎటువంటి సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలంటే తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. 40 ఏళ్ల వయసు దాటిన వారు కొన్ని ఆహారాలను తీసుకుంటే ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు.

ముఖ్యంగా Egg తింటే ఎన్నో పోషకాలు మన శరీరానికి అంది ఎన్నో ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. 40 సంవత్సరాలు దాటిన తర్వాత ఎముకలు బలహీనంతో పాటు కండరాల నొప్పులు వంటివి కూడా వస్తూ ఉంటాయి. గుడ్డు తినటం వలన శరీరానికి అవసరమైన ప్రోటీన్స్, విటమిన్లు, కాల్షియం అంది అలసట, నీరసం వంటివి కూడా ఉండవని పోషకాహార నిపుణులు చెప్పుతున్నారు.

you should definitely take eggs if your age is above 40 years

గుడ్డును ఉడికించి తింటేనే మంచిది. ఒక ఉడికించిన గుడ్డులో పోషకాల విషయానికి వచ్చే సరికి 6.3 గ్రాముల ప్రోటీన్, 77 కేలరీలు, 212 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్, 0.6 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 5.3 గ్రాముల ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్-A, విటమిన్-B2, విటమిన్-B5, ఫాస్పరస్ మరియు సెలీనియం వంటివి ఉంటాయి.

అయితే రోజుకి ఎన్ని గుడ్లు తినాలి… అనే విషయానికి వచ్చేసరికి రోజుకి ఒక గుడ్డు తింటే సరిపోతుంది. గుడ్డు త్వరగా జీర్ణం కావడమే కాకుండా శక్తినిస్తుంది. అలాగే కొవ్వు శాతం కూడా తక్కువ ఉంటుంది. కాబట్టి 40 సంవత్సరాలు దాటిన వారు తప్పనిసరిగా ప్రతి రోజు ఉడికించిన Egg తింటే మంచిది.

Admin

Recent Posts