టెస్టోస్టెరాన్ పాత్ర.. ఇది పురుషులలో లైంగిక కోరికకు సహాయపడుతుంది. అయితే టెస్టోస్టెరాన్ స్థాయిలు తక్కువగా ఉన్నా కొందరికి నార్మల్ లైబిడో ఉండవచ్చు, మరికొందరికి ఎక్కువ టెస్టోస్టెరాన్ ఉన్నా ఆసక్తి తక్కువగా ఉండొచ్చు. టెస్టోస్టెరాన్ స్థాయిలకు సంబంధించిన నిబంధిత పరిమితులు ఉన్నాయి. వయస్సు పెరిగేకొద్దీ టెస్టోస్టెరాన్ స్థాయిలు తగ్గుతాయి. ఈ ప్రక్రియను టెస్టోస్టెరాన్ డిప్రెషన్ అంటారు. ఆహారం మరియు జీవన శైలి.. సమతుల్య ఆహారం, పరిశుభ్రత, నిద్ర టెస్టోస్టెరాన్ స్థాయిలను బలపరుస్తాయి. స్ట్రెస్ దీర్ఘకాలిక స్ట్రెస్ టెస్టోస్టెరాన్ స్థాయిలను తగ్గిస్తుంది. డోపమైన్ (Dopamine).. ఇది సంతోష హార్మోన్అని పిలుస్తారు. మస్తిష్కంలో ప్రేరణ, ప్రగతి, కోరికలకు సంబంధించి ప్రధాన పాత్ర పోషిస్తుంది. లైంగిక కోరికలు, ఆనందం అనుభూతి దీనివల్ల కలుగుతాయి.
టెస్టోస్టెరాన్ డోపమైన్ విడుదలను పెంచగలదు, అందువల్ల లైంగిక కోరికలు అధికమవుతాయి. ఆక్సిటోసిన్ (Oxytocin).. ఇది ప్రేమ హార్మోన్ అని పిలుస్తారు. శారీరక సమీపత, ప్రేమ, సంబంధ బంధం, మాతృత్వ భావనలు ఇందులో ప్రధానంగా ఉంటాయి. లైంగిక సంబంధాల్లో ఆక్సిటోసిన్ స్థాయిలు పెరుగుతాయి, ముఖ్యంగా అంగసంయోగం సమయంలో. ఇది శాంతి, నమ్మకం వంటి భావాలను ప్రేరేపిస్తుంది. ఒత్తిడి, ఆందోళన, లేదా మానసిక సమస్యలు లైంగిక కోరికను దెబ్బతీయవచ్చు. ఒక భాగస్వామితో ఉన్న సంబంధం నాణ్యత, సాన్నిహిత్యం, భావోద్వేగ అనుబంధం లైంగిక కోరికపై ప్రభావం చూపుతుంది. శారీరక ఆరోగ్యం, జీవనశైలి, నిద్ర, ఆహారం కూడా ప్రభావితం చేస్తాయి. అందువల్ల, లైంగిక భావాలు అనేవి టెస్టోస్టెరాన్‌తో పాటు శారీరక, మానసిక, సామాజిక అంశాల కలయిక ఫలితంగా ఏర్పడతాయి.
ఒంటరి ఉండా కుండా చూసుకోండి. ఎవరూ ఇంట్లో లేక పోతే ఏదో ఒక పనిలో ఉండండి. ఖాళీగా కూర్చుని ఉంటే హర్మోన్ల కూర్చోనివ్వవు. నగ్న చిత్రాలు కానీ వీడియోలు గానీ చూడొద్దు. కోరికలు కలిగే ఆలోచనలు వస్తే నియంత్రించండి. కడుపు నిండా భోజనం చెయ్యవద్దు. సినిమా లో గానీ యూట్యూబ్ లో గాని ఐటమ్ సాంగ్స్ చూడవద్దు. ఇప్పటి సినిమాలు ఐటమ్ సాంగ్ లేనిది చిత్రం చాలా అరుదు. శృంగార కాంక్షలు రేకెత్తించే లాంటి దృశ్యాలు పెడతారు. పెళ్ళి అయ్యిన వారు నియత్రించుకుంటారు, పెళ్ళి కానీ వాళ్ళ సంగతి అంతే మరి. అలా ఉంటుంది సినిమాలు చూస్తే. మీరు సినిమా కి వెళ్లిన అలాంటి పాట వస్తుంది అంటే మీరు బయటకు వచ్చి పాటకు వెళ్ళండి (టాయిలెట్). ఇలా చేస్తే కొద్దో గొప్పో బయట పడతారు.