పోష‌ణ‌

రాత్రి పూట అర‌టి పండ్ల‌ను అస‌లు తిన‌వ‌ద్ద‌ట‌.. ఎందుకంటే..?

అర‌టి పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ఎన్ని ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. అర‌టి పండ్ల‌ను తింటే నీర‌సం, అల‌స‌ట త‌గ్గిపోతాయి. శ‌రీరానికి శ‌క్తి ల‌భించి ఉత్సాహంగా మారుతారు. యాక్టివ్‌గా ఉంటారు. రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. జీర్ణ వ్య‌వ‌స్థ ఆరోగ్యంగా ఉంటుంది. ఇలా అర‌టి పండ్ల‌ను తింటే ఎన్నో లాభాల‌ను పొంద‌వ‌చ్చు. కానీ ఈ పండ్ల‌ను రాత్రి పూట మాత్రం తిన‌వ‌ద్ద‌ని డాక్ట‌ర్లు చెబుతున్నారు. అది ఎందుకు అంటే..

రాత్రి భోజనం అయ్యాక కొంతమందికి అరటిపండు తినే అలవాటు ఉంటుంది. భోజనం తర్వాత అరటి పండు తింటే త్వరగా జీర్ణం అవుతుంది అనే భావనతో చేస్తుంటారు. మరికొంతమంది వెయిట్ పెరగడానికి భోజనం తర్వాత అరటి పళ్ళను తింటారు.

you should not take banana at night know why

అయితే రాత్రి భోజనం తర్వాత అరటిపండును తినడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. రాత్రిపూట అరటి పండు తినడం వల్ల ఊపిరితిత్తుల సమస్యలకు, జలుబుకు దారితీస్తుందని చెబుతున్నారు. దీనికి బదులు అరటిపండును మధ్యాహ్నం తింటే ఆరోగ్యానికి మంచిదని సూచిస్తున్నారు. అలాగే ఖాళీ కడుపుతో అరటిపండు తింటే కాస్త అసౌకర్యానికి గురవుతారని తెలిపారు.

Admin

Recent Posts