Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

ప‌చ్చి బ‌ఠానీల‌ను రోజూ తిన‌డం వ‌ల్ల క‌లిగే 8 అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు

Admin by Admin
April 4, 2021
in కూర‌గాయ‌లు
0
Share on FacebookShare on Twitter

ప‌చ్చి బ‌ఠానీల‌ను సాధార‌ణంగా చాలా మంది ప‌లు కూర‌ల్లో వేస్తుంటారు. ఇవి చ‌క్కని రుచిని క‌లిగి ఉంటాయి. కొంద‌రు వీట‌ని రోస్ట్ రూపంలో, కొంద‌రు ఫ్రై రూపంలో చేసుకుని తింటారు. అయితే నిత్యం వీటిని తిన‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

green peas health benefits in telugu

You might also like

Ivy Gourd Benefits : దొండ‌కాయ‌ల గురించి ఈ విష‌యాలు తెలిస్తే.. వెంటనే తిన‌డం ప్రారంభిస్తారు..!

November 3, 2024

ఇలాంటి వారు కాక‌ర‌కాయ అస్స‌లు తిన‌కూడ‌దు.. తింటే లేని పోని క‌ష్టాలు కొని తెచ్చుకున్న‌ట్టే..!

October 30, 2024

1. జీర్ణ ప్ర‌క్రియ

నిత్యం ప‌చ్చి బ‌ఠానీల‌ను తిన‌డం వ‌ల్ల జీర్ణ ప్ర‌క్రియ మెరుగ్గా ఉంటుంది. జీర్ణ స‌మ‌స్య‌లు ఉండ‌వు. ఇందులో ఉండే ఫైబ‌ర్ మ‌ల‌బ‌ద్ద‌కాన్ని తొలగిస్తుంది. రోజూ విరేచ‌నం సాఫీగా అయ్యేలా చేస్తుంది. జీర్ణ‌వ్య‌వ‌స్థ ప‌నితీరు మెరుగు ప‌డుతుంది.

2. ఐర‌న్

శ‌రీరంలో ఐరన్ లోపిస్తే ర‌క్తం బాగా త‌యారుకాదు. దీంతో ర‌క్త‌హీన‌త స‌మ‌స్య ఏర్ప‌డుతుంది. అయితే ప‌చ్చి బ‌ఠానీల‌ను తిన‌డం వ‌ల్ల ఐర‌న్ బాగా ల‌భిస్తుంది. ఎందుకంటే వీటిలో ఐర‌న్ స‌మృద్ధిగా ఉంటుంది. అందువ‌ల్ల నిత్యం వీటిని తింటే ఐర‌న్ అందుతుంది. ఫ‌లితంగా ర‌క్తం బాగా త‌యారవుతుంది. రక్త‌హీన‌త స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

3. రోగ నిరోధ‌క శ‌క్తి

ప‌చ్చి బ‌ఠానీల్లో విట‌మిన్ సి స‌మృద్ధిగా ఉంటుంది. అందువ‌ల్ల శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. వీటిల్లో ఫైటో అలెక్సిన్స్ అన‌బ‌డే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది హెచ్‌.పైలోరి ఇన్‌ఫెక్ష‌న్ రాకుండా చూస్తుంది. ఈ బాక్టీరియా జీర్ణాశ‌యంలో అల్స‌ర్ల‌కు, క్యాన్స‌ర్ల‌కు కార‌ణం అవుతుంది. ప‌చ్చి బ‌ఠానీల‌ను తిన‌డం వ‌ల్ల ఈ బాక్టీరియా న‌శిస్తుంది.

4. కంటి ఆరోగ్యం

ప‌చ్చి బ‌ఠానీల్లో లుటీన్ అన‌బ‌డే కెరోటినాయిడ్ ఉంటుంది. ఇది కళ్ల‌లో శుక్లాలు రాకుండా చూస్తుంది. కంటి చూపును మెరుగు ప‌రుస్తుంది. కంటి ఆరోగ్యం సుర‌క్షితంగా ఉంటుంది.

5. గుండెకు

ప‌చ్చి బ‌ఠానీల్లో ఉండే ఇన్‌సాల్యుబుల్ ఫైబ‌ర్ గుండె జ‌బ్బులు, హార్ట్ ఎటాక్ లు రాకుండా చూస్తుంది. శ‌రీరంలో షుగ‌ర్ స్థాయిలు నియంత్ర‌ణ‌లో ఉంటాయి.

6. అధిక బ‌రువు

ప‌చ్చి బ‌ఠానీల్లో క్యాల‌రీలు త‌క్కువ‌గా ఉంటాయి. ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది. అందువ‌ల్ల బ‌రువు త‌గ్గాల‌నుకునే వారికి ఇది చ‌క్క‌ని ఆహార ఆప్ష‌న్ అని చెప్ప‌వ‌చ్చు. దీని వ‌ల్ల ఆక‌లి నియంత్ర‌ణ‌లో ఉంటుంది. ఎక్కువ ఆహారం తిన‌కుండా ఉంటారు.

7. చ‌ర్మ సంర‌క్ష‌ణ

ప‌చ్చి బ‌ఠానీల్లో ఉండే విట‌మిన్ సి మ‌న శ‌రీరంలో కొల్లాజెన్‌ను ఉత్ప‌త్తి చేస్తుంది. దీంతో చ‌ర్మం దృఢంగా, కాంతివంతంగా ఉంటుంది. ఫ్రీ ర్యాడిక‌ల్స్ నిర్మూలించ‌బ‌డ‌తాయి. ప‌చ్చి బ‌ఠానీల్లో ఉండే ఫ్లేవ‌నాయిడ్స్‌, కాటెచిన్స్‌, ఎపికాటెచిన్‌, కెరోటినాయిడ్స్ వృద్ధాప్య ఛాయ‌లు రానీయ‌వు. దీంతో చ‌ర్మం య‌వ్వ‌నంగా క‌నిపిస్తుంది.

8. పురుషుల ఆరోగ్యానికి

ప‌చ్చి బ‌ఠానీలు పురుషుల్లో శుక్ర క‌ణాల సంఖ్య‌ను పెంచుతాయి. అలాగే అవి ఎక్కువ వేగంగా క‌దిలే సామ‌ర్థ్యాన్ని పొందుతాయి. ప‌చ్చి బ‌ఠానీల‌ను తిన‌డం వ‌ల్ల శుక్ర క‌ణాలు దృఢంగా మారుతాయి. దీంతో సుల‌భంగా అండంతో క‌లుస్తాయి. ఫ‌లితంగా సంతాన లోపం స‌మ‌స్య ఉండ‌దు.

ప‌చ్చి బ‌ఠానీల‌ను ఉడ‌క‌బెట్టుకుని తిన‌వ‌చ్చు. లేదా వాటిని సూప్‌ల‌లో వేసి తీసుకోవ‌చ్చు. ఎలా తీసుకున్నా ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలే క‌లుగుతాయి.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Tags: gree peasgreen peas benefitsgreen peas health benefitsgreen peas useshealth benefits of green peasప‌చ్చి బ‌ఠానీల ఉప‌యోగాలుప‌చ్చి బ‌ఠానీల ప్ర‌యోజ‌నాలుప‌చ్చి బ‌ఠానీల లాభాలుప‌చ్చి బ‌ఠానీలు
Admin

Admin

Related Stories

Ivy Gourd Benefits : దొండ‌కాయ‌ల గురించి ఈ విష‌యాలు తెలిస్తే.. వెంటనే తిన‌డం ప్రారంభిస్తారు..!

by Admin
November 3, 2024
0

Ivy Gourd Benefits : ఆరోగ్యానికి దొండకాయ ఎంతో మేలు చేస్తుంది. చాలామందికి దొండకాయ వలన కలిగే లాభాలు గురించి తెలియదు. దొండకాయలో పీచు పదార్థాలు ఎక్కువ...

ఇలాంటి వారు కాక‌ర‌కాయ అస్స‌లు తిన‌కూడ‌దు.. తింటే లేని పోని క‌ష్టాలు కొని తెచ్చుకున్న‌ట్టే..!

by Sam
October 30, 2024
0

కాక‌ర‌కాయ‌ని చాలా మంది తిన‌డానికి ఇష్ట‌ప‌డ‌రు. అది కాస్త చేదుగా ఉండ‌డంతో తిన‌డానికి ముందుకు రారు. అయితే కాకర రుచి చేదుగా ఉన్నా దీనిలో ఉండే ఎన్నో...

పొర‌పాటున ముల్లంగిని వాటితో క‌లిపి తింటే ఆరోగ్యం పాడ‌వుతుంది..!

by Sam
October 27, 2024
0

మారుతున్న‌ వాతావ‌ర‌ణం, జీవ‌న శైలి వ‌ల‌న చాలా మంది అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో ఇబ్బందిప‌డుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పండ్లు, తాజా కూరగాయలు తీసుకోవడం వ‌ల‌న ఆరోగ్యానికి ఎంతో...

Ponnaganti Kura : ఈ ఆకుకూర‌ను తింటే ఎన్ని ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసా.. న‌మ్మ‌లేరు..!

by Admin
October 27, 2024
0

Ponnaganti Kura : అమరాంథేసి కుటుంబానికి చెందిన పొన్నగంటి కూర సంవత్సరం పొడవునా లభ్యం అవుతుంది. ఈ కూర పొలాల గట్ల వెంట ఎక్కువగా కనబడుతూ ఉంటుంది....

Next Post

ప‌ప్పు దినుసుల‌ను ఇలా తీసుకుంటే ఎక్కువ ప్ర‌యోజ‌నాలు పొంద‌వ‌చ్చు..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.