Off Beat

సబ్బు, సర్ఫ్ లేని రోజుల్లో పూర్వ‌కాలంలో ప్రజలు బట్టలను ఎలా ఉతికేవారో తెలుసా..?

మార్కెట్లోకి ఎప్పటికప్పుడు కొత్త రకం దుస్తులు వస్తూనే ఉంటాయి. అయితే ఎలాంటి దుస్తులు అయిన ధరించిన తర్వాత మురికి పడడం సర్వసాధారణం. ఇలా మురికి పడిన సమయంలో వాటిని ఉతికి మళ్ళీ తిరిగి వేసుకోవడం చేస్తూ ఉంటాం. ఇటీవల కాలంలో అయితే బట్టలను ఉతకడానికి అనేక రకాల సబ్బులు, డిటర్జెంట్ పౌడర్స్, వాషింగ్ మిషన్లు వచ్చాయి. సాధారణ సబ్బుల నుంచి సేంద్రియ సభ్యుల వరకు మార్కెట్లో విరివిగా దొరుకుతున్నాయి. రకరకాల పేర్లతో, రకరకాల రంగులతో, వివిధ రకాల ఆకారాలతో ఈ సబ్బులు ఆకట్టుకుంటున్నాయి. అంతేకాకుండా వీటి నుంచి వచ్చే సువాసనలు వినియోగదారులను ఇట్టే మైమరిపించేస్తున్నాయి.

ఈ సబ్బులను ఉపయోగించి బట్టలను తల తల మెరిసేలా ఉతికేస్తున్నారు. కానీ ఈ సబ్బులు, సర్ఫ్ లు అందుబాటులోకి రాకముందు ప్రజలు బట్టలను ఎలా ఉతికేవారు అన్నది మాత్రం చాలా మందికి తెలియని సమాధానం. సుమారు 130 సంవత్సరాల క్రితం డిటర్జెంట్ భారతదేశం లోకి తొలిసారి వచ్చింది. బ్రిటిష్ కంపెనీ లిబర్ బ్రదర్స్ ఇంగ్లాండ్.. భారత మార్కెట్ లోకి ఈ సబ్బులను విడుదల చేసింది. ఇండియాలో సబ్బులు అందుబాటులోకి రాకముందు 1987వ సంవత్సరంలో మొదటిసారిగా మీరట్ లో స్నానం చేయడానికి, బట్టలు ఉతకడానికి అవసరమైన సబ్బు, సర్ఫ్ లో ఉత్పత్తి చేసేందుకు ఒక ఫ్యాక్టరీని స్థాపించారు. కానీ ఈ సబ్బులు అందుబాటులోకి రాకముందు భారతీయులు తమ దుస్తులను సేంద్రియ వస్తువులతో శుభ్రం చేసుకునేవారు.

washing clothes

ఇలా బట్టల్ని శుభ్రపరచుకోవడానికి ఎక్కువగా కుంకుడుకాయలు ఉపయోగించేవారు. రాజుల రాజభవనాల తోటలలో ఎక్కువగా కుంకుడు చెట్లను నాటేవారు. ఆ కుంకుడుకాయల పీల్స్ నుంచి వచ్చే నురగతో మురికి బట్టలను శుభ్రం చేసేవారు. నేటికీ ఖరీదైన పట్టు వస్త్రాలను శుభ్రం చేయడానికి కుంకుడుగాయలనే ఉపయోగిస్తారు. ఇక ఈ కుంకుడుకాయలు కూడా అందుబాటులో లేని సమయంలో బట్టలను వేడి నీళ్లలో నానబెట్టేవారు. ఆ తరువాత రాళ్లపై కొడుతూ మురికిని పోగొట్టేవారు. ఇప్పటికీ కూడా ధోబిఘాట్ లో సబ్బు, సర్ఫ్ లేకుండా పాత పద్ధతిలోనే బట్టలు ఉతకడం చూస్తూనే ఉంటాం.

Admin

Recent Posts