vastu

మీ ఇంట్లో లోహ‌పు తాబేలును ఇలా పెట్టండి.. వాస్తు దోషం పోతుంది..

కొందరు నిత్యం ఆర్ధిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు. నిజంగా ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. వచ్చిన డబ్బులు కూడా ఇట్టే ఖర్చు అయి పోతుంటాయి. మీకు కూడా ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా వస్తున్నాయా…?, డబ్బులు మంచి నీళ్లలా ఖర్చు అయ్యి పోతున్నాయా..?, అయితే పండితులు చెబుతున్న ఈ అద్భుతమైన చిట్కాలను పాటించండి. ఈ విధంగా కనుక మీరు అనుసరించారు అంటే తప్పకుండా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి.

వాస్తు పండితులు మెటల్ తాబేలు గురించి చెబుతున్నారు. తప్పకుండా ఈ విషయాలను మీరు పాటిస్తే సమస్య నుండి బయట పడవచ్చు. మన ఇంట్లో తాబేలుని ఉంచడం వల్ల మన ఆయుర్దాయం పెరుగుతుంది. అదే విధంగా మన మీద మనకు నమ్మకం పెరుగుతుంది. నిజంగా మీ పై మీకు నమ్మకం తక్కువగా ఉన్నప్పుడు దీనిని ప్రయత్నం చేసి చూడండి.

keep metal tortoise like this in your home for luck

ఒకవేళ కనుక దీనిని మీరు ఇంట్లో పెట్టారంటే ఖచ్చితంగా శుభం కలుగుతుంది. ఎక్కువసేపు మీరు ఎక్కడైతే మీ ఇంట్లో సమయాన్ని వెచ్చిస్తారో.. ఆ ప్రదేశంలో తాబేలును ఉంచండి ఒక పెద్ద బౌల్ తీసుకుని దాని నిండా నీళ్లు పోసి అందులో తాబేలు వేసి ఉత్తరం వైపు ని పెడితే మంచిది. తాబేలుని ఉంచడం వల్ల ధనం పెరుగుతుంది. మీకు కనుక ఆర్ధిక సమస్యలు ఉంటే క్రిస్టల్ తాబేలుని మీరు ఇంట్లో ఉంచచ్చు. ఆఫీసులో కూడా పెట్టుకుంటే మంచిది. ఇలా ఈ విధంగా ఆర్థిక సమస్యల నుండి బయట పడవచ్చు. ఎంతో ఆనందంగా ఏ ఇబ్బంది లేకుండా ఉండొచ్చు.

Admin

Recent Posts