పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలప్పుడు ఎవరైనా ఆతిథ్యం ఇచ్చిన వారికి గిఫ్ట్‌లు ఇవ్వడం పరిపాటి. ఇవే కాకుండా ఇతర సందర్భాల్లోనూ కొందరు గిఫ్ట్‌లు ఇస్తుంటారు. అయితే గిఫ్ట్‌లు ఎలా ఇచ్చినా వాటిని అందుకున్నవారికి అవి ఉపయోగపడే విధంగా ఉండాలి. అలా ఉంటేనే ఇచ్చిన గిఫ్ట్‌కు సార్థకత చేకూరుతుంది. ఈ క్రమంలోనే ఇలా గిఫ్ట్‌లు ఇచ్చేటప్పుడు సాధారణంగా చాలా మంది వివిధ రకాల వస్తువులను గిఫ్ట్‌లుగా ఎంపిక చేసుకుంటారు. అయితే మీకు తెలుసా..? కొన్ని వస్తువులను మాత్రం మనం గిఫ్ట్‌లుగా ఇవ్వకూడదట. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. కత్తి, నెయిల్ కట్టర్, కిచెన్‌లో ఉపయోగించే కత్తులు, బ్లేడ్లు, చెయిన్ సా వంటి పదునైన వస్తువులను గిఫ్ట్‌లుగా ఇవ్వకూడదు. అలా ఇస్తే అవతలి వ్యక్తితో ఉండే మంచి రిలేషన్ షిప్ కట్ అవుతుందట. సహజంగానే అలాంటి పదునైన వస్తువులు చంపే స్వభావాన్ని కలిగి ఉంటాయట. దీంతో ఇలాంటి గిఫ్ట్‌లను అందుకునే వారికి దురదృష్టం కలుగుతుందట.
చెమట, కన్నీళ్లు వంటివి తుడుచుకునేందుకు, ముఖం తుడవడానికి ఎవరైనా హ్యాండ్ కర్చీఫ్‌లను వాడుతారు. అయితే అలాంటి హ్యాండ్ కర్చీఫ్‌లను మాత్రం అవతలి వారికి గిఫ్ట్‌లుగా ఇవ్వకూడదట. ఎందుకంటే వాటిని బహుమతిగా పొందిన వారు భవిష్యత్తులో దుఃఖంలోనే ఉంటారట. చెప్పులు, షూస్ ను కూడా ఎవరికైనా గిఫ్ట్‌లుగా ఇవ్వకూడదు. ఇస్తే వారికి అశుభం జరుగుతుందట. వారు సంతోషంగా ఉండరట. ఎప్పుడూ విషాదంలోనే ఉంటారట. అలారం క్లాక్స్, వాల్ క్లాక్స్, చేతి గడియారాలను ఎవరికీ బహుమతిగా ఇవ్వరాదు. ఇస్తే వాటిని అందుకున్న వారికి మంచి జరగదు. వారి ఆయుర్దాయం తగ్గిపోతుందట. అన్నీ కష్టాలనే అనుభవిస్తారట.
నలుపు రంగును అశుభానికి, చెడుకు సంకేతంగా భావిస్తారు చాలా మంది. ఈ క్రమంలోనే ఎవరూ కూడా ఇతరులకు నలుపు రంగు దుస్తులను గిఫ్ట్‌లుగా ఇవ్వకూడదు. ఇస్తే ఆ గిఫ్ట్‌లను అందుకున్నవారికి అంతా చెడే జరుగుతుందట. ఏదీ కలసిరాదట. ఆయుర్దాయం కూడా తగ్గుతుందట.