viral news

అంతర్వేదిలో స్నానానికి వెళ్లొద్దని పోలీసుల హెచ్చరిక..ఆ నీళ్లలో ఏముంది?

అంతర్వేది సముద్రంలో విష పురుగులున్నాయని, అక్కడ సముద్ర స్నానానికి వెళ్లవద్దని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి పోలీసులు హెచ్చరించారు. గత ఆదివారం అంతర్వేది బీచ్‌‌కి వచ్చిన కొందరు పర్యాటకులను జెల్లీ ఫిష్‌లు కుట్టడంతో అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందారు. జెల్లీ ఫిష్‌లోని హైడ్రోజోవా వర్గానికి చెందిన వీటిని బ్లూ డ్రాగన్ జెల్లీ ఫిష్ అంటారని చేపలపై పరిశోధనలు చేసిన ఆంధ్రా యూనివర్సిటీ జువాలజీ విభాగం ప్రొఫెసర్ మంజులత చెప్పారు.

మూడేళ్ల కిందట విశాఖ రుషికొండ తీరంలో కూడా జెల్లీ ఫిష్‌లు కనిపించాయి. సందర్శకులను భయాందోళనలకు గురి చేశాయి. ఇంతకీ ఇవి జెల్లీ ఫిష్‌లా, విషపురుగులా? అంతర్వేదిలో, రుషికొండలో కనిపించిన ఈ రెండూ ఒకే జాతికి చెందినవా? ఇవి ప్రమాదకరమా? అంతర్వేదిలో ఏం జరిగింది? జూన్ 30వ తేదీన అంతర్వేది సముద్ర తీరంలో ఊదా రంగులో జిగటగా, ముద్దలా (sticky, jelly like) ఉన్న జీవి కుట్టడంతో ఒళ్లంతా దద్దుర్లు, దురదలతో ఇద్దరు వ్యక్తులు అస్వస్థతకు గురయ్యారు.

police strict warning in antarvedi because of jelly fish

స్థానికులు వారిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. దీంతో అంతర్వేది తీరంలో జెల్లీ ఫిష్‌లు కుట్టాయంటూ సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయ్యాయి. వీటిని అగ్గిబాట పురుగులు(ఒక రకమైన జెల్లీ ఫిష్‌లు)గా పిలుస్తుంటామని స్థానిక మత్స్యకారులు చెప్పారు. మాకు ఈ పురుగులు అప్పుడప్పుడు కనిపిస్తాయి. ఇవి శరీరానికి తాకినా, కుట్టినా ఆ భాగంలో మంటలు, దురదలు వస్తాయి. మేం వెంటనే బీచ్‌లో స్నానం చేస్తాం, తగ్గిపోతుంది. ఈ నేపథ్యంలో అంతర్వేది సముద్రంలో విష పురుగులున్నాయి, సముద్ర స్నానానికి ఎవ్వరు వెళ్లవద్దు అని సఖినేటిపల్లి పోలీసులు హెచ్చరిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.

Admin

Recent Posts