Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Pesara Garelu : పెస‌ర‌పప్పు గారెలు.. త్వ‌ర‌గా జీర్ణ‌మ‌వుతాయి.. రుచికి రుచి కూడా..!

D by D
May 9, 2022
in food, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Pesara Garelu : మ‌నం వంటింట్లో అప్పుడ‌ప్పుడు గారెలను త‌యారు చేస్తూ ఉంటాం. గారెల త‌యారీకి ఎక్కువ‌గా మిన‌ప ప‌ప్పును, బొబ్బెర ప‌ప్పును ఉప‌యోగిస్తూ ఉంటాం. కొంద‌రు ప‌ప్పు కూర‌లు, చారు వంటి వాటిని త‌యారు చేసుకునే పెస‌ర ప‌ప్పుతో గారెలను త‌యారు చేస్తూ ఉంటారు. పెస‌ర ప‌ప్పుతో చేసే గారెలు కూడా చాలా రుచిగా ఉంటాయి. వీటిని చాలా సులువుగా త‌యారు చేసుకోవ‌చ్చు. పెస‌ర ప‌ప్పుతో గారెలను ఎలా త‌యారు చేసుకోవాలి.. వాటి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

Pesara Garelu are very healthy make in this way
Pesara Garelu

పెస‌ర ప‌ప్పు గారెల‌ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

పెస‌ర ప‌ప్పు – అర కిలో, త‌రిగిన ఉల్లిపాయ‌లు – 2 (మ‌ధ్య‌స్థంగా ఉన్న‌వి), త‌రిగిన క‌రివేపాకు – రెండు రెబ్బ‌లు, త‌రిగిన అల్లం ముక్క‌లు – 2 టేబుల్ స్పూన్స్, ప‌చ్చి మిర‌ప‌కాయ‌లు – 10, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, జీల‌క‌ర్ర – 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు – రుచికి త‌గినంత‌, నూనె – డీప్‌ ఫ్రైకు స‌రిప‌డా.

పెస‌ర ప‌ప్పు గారెల‌ను త‌యారు చేసే విధానం..

ముందుగా పెస‌ర ప‌ప్పును శుభ్రంగా క‌డిగి త‌గినన్ని నీళ్లు పోసి 4 గంట‌ల పాటు నాన‌బెట్టుకోవాలి. త‌రువాత ఒక జార్ లో నాన‌బెట్టిన పెస‌ర ప‌ప్పును వేసి మ‌రీ మెత్త‌గా కాకుండా కొద్దిగా కచ్చా ప‌చ్చాగా ఉండే విధంగా మిక్సీ ప‌ట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత అదే జార్ లో త‌రిగిన ఉల్లిపాయ‌లు, త‌రిగిన అల్లం ముక్క‌లు, ప‌చ్చి మిర‌ప‌కాయ‌లు, జీల‌క‌ర్ర‌, త‌గినంత ఉప్పు వేసి క‌చ్చా ప‌చ్చాగా ఉండే విధంగా చేసుకుని మిక్సీ ప‌ట్టిన పెస‌ర ప‌ప్పులో వేసి క‌ల‌పాలి. దీనితో పాటుగా త‌రిగిన క‌రివేపాకు, కొత్తిమీర‌ను కూడా వేసి అన్నా క‌లిసేలా బాగా క‌లుపుకోవాలి.

ఇప్పుడు ఒక క‌ళాయిలో నూనె పోసి నూనె కాగిన త‌రువాత పెస‌ర ప‌ప్పు మిశ్ర‌మాన్ని గారెలుగా చేసి నూనెలో వేసి రెండు దిక్కుల ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే పెస‌ర ప‌ప్పు గారెలు త‌యార‌వుతాయి. వీటిని నేరుగా లేదా పల్లీల‌ చ‌ట్నీల‌తో క‌లిపి తింటే ఎంతో రుచిగా ఉంటాయి. పెస‌ర ప‌ప్పు గారెల‌ను ఉద‌యం అల్పాహారంలో లేదా సాయంత్రం స్నాక్స్ గా కూడా తీసుకోవ‌చ్చు. పెస‌ర ప‌ప్పుతో త‌ర‌చూ ప‌ప్పు కూర‌లు, చారు వంటి వాటినే కాకుండా ఇలా గారెల‌ను త‌యారు చేసుకుని తిన‌డం వ‌ల్ల కూడా పెస‌ర ప‌ప్పు వ‌ల్ల క‌లిగే లాభాల‌ను పొంద‌వ‌చ్చు. ఇత‌ర ప‌ప్పుల‌తో చేసిన గారెల కంటే పెస‌ర ప‌ప్పుతో చేసిన గారెలు త్వ‌ర‌గా జీర్ణ‌మ‌వుతాయి.

Tags: Pesara Garelu
D

D

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Crispy Alu Fry : ఆలుగ‌డ్డ‌ల‌తో క్రిస్పీ ఆలు ఫ్రై.. త‌యారీ ఇలా.. భ‌లే టేస్ట్ ఉంటాయి..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.