Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

జుట్టు బాగా రాలుతుందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే అస‌లు జుట్టు రాల‌దు..

D by D
September 2, 2022
in చిట్కాలు, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

మ‌నం ఆహారంలో భాగంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో సొర‌కాయ కూడా ఒక‌టి. దీనిని మ‌నం ఎంతో కాలంగా ఆహారంగా తీసుకుంటున్నాము. సొర‌కాయ‌ల‌తో ప‌చ్చ‌డి, ప‌ప్పు, కూర వంటి వాటిని త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. సొర‌కాయ‌లో మ‌న శరీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉన్నాయి. సొర‌కాయ శ‌రీరానికి చ‌ల్ల‌ద‌నాన్ని ఇస్తుంది. సులువుగా జీర్ణం కూడా అవుతుంది. మూత్ర నాళాల జ‌బ్బుల‌కు ఇది చ‌క్క‌టి ఔష‌ధంలా ప‌ని చేస్తుంది. ప‌చ్చి సొర‌కాయను జ్యాస్ గా చేసుకుని తీసుకోవ‌డం వ‌ల్ల అల‌స‌ట త‌గ్గుతుంది. అధిక దాహం స‌మ‌స్య నుండి కూడా ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది.

ఈ సొర‌కాయ ఎలాంటి నేల‌లోనైనా పెరుగుతుంది. ఇలాంటి సొర‌కాయ‌ల‌తో జుట్టు రాల‌డాన్ని అరికట్ట‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. చాలా మందికి జుట్టు ఎక్కువ‌గా రాలిపోతూ ఉంటుంది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అంద‌రిలోనూ ఈ స‌మ‌స్య ఉత్ప‌న్న‌మ‌వుతుంది. ఎన్ని మందులు, షాంపులు, హెయిర్ ఆయిల్స్ వాడినా ఉప‌యోగం లేకుండా పోతుంది. ఇలా జుట్టు రాలే స‌మ‌స్య ఉన్న వారు సొర‌కాయ ర‌సాన్ని త‌ల‌కు ప‌ట్టించి అర గంట త‌రువాత త‌ల‌స్నాం చేయ‌డం వ‌ల్ల జుట్టు రాల‌డం త‌గ్గుతుంది. ఈ విధంగా సొర‌కాయ ర‌సాన్ని త‌ర‌చూ ఉప‌యోగించ‌డం వ‌ల్ల జుట్టు మృదువుగా కూడా త‌యార‌వుతుంది.

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

if you have hair fall then follow these wonderful remedies

సొర‌కాయ‌తోపాటు జుట్టు రాల‌డం స‌మ‌స్య ఉన్న వారు కొబ్బ‌రి నూనెను లేదా బాదం నూనెను వేడి చేసి జుట్టుకు రాసుకోవాలి. త‌రువాత నూనె చ‌ర్మంలోకి ఇంకేలా మ‌ర్ద‌నా చేయాలి. ఇలా చేయ‌డం వల్ల జుట్టు కుదుళ్లు గ‌ట్టిప‌డి జుట్టు రాల‌డం త‌గ్గుతుంది. జుట్టు రాల‌డాన్ని త‌గ్గించే మ‌రికొన్ని ప‌దార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆరోగ్య‌క‌ర‌మైన జుట్టుకు ఉప‌యోగ‌ప‌డే ఎంజైమ్ లు క‌ల‌బందలో అధికంగా ఉంటాయి. క‌ల‌బంద గుజ్జును త‌ల‌కు రాసుకున్నా లేదా క‌ల‌బంద ర‌సాన్ని రోజూ ఒక టీ స్పూన్ మోతాదులో తీసుకున్నా కూడా జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.

గుడ్డు తెల‌సొన‌, పెరుగు మిశ్రమం కూడా జుట్టు రాల‌డాన్ని త‌గ్గిస్తుంది. రెండు కోడి గుడ్ల తెల్ల‌సొన‌ను ఒక గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత దీనికి రెండు టీ స్పూన్ల తాజా పెరుగును కల‌పాలి. ఇలా త‌యారు చేసిన మిశ్ర‌మానికి వేప ఆకుల పొడిని క‌లిపి జుట్టుకు రాసుకోవ‌డం వ‌ల్ల జుట్టు రాల‌డం త‌గ్గ‌డంతోపాటు ఇత‌ర జుట్టు సంబంధిత స‌మ‌స్య‌లు కూడా తగ్గుతాయి. ఈ విధంగా పైన తెలిపిన చిట్కాల‌ను వాడ‌డం వ‌ల్ల జుట్టుకు స‌రైన పోష‌కాలు అంది జుట్టు రాల‌డం త‌గ్గడంతోపాటు జుట్టు న‌ల్ల‌గా, ఒత్తుగా, ఆరోగ్య‌వంతంగా పెరుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

Tags: hair fall
D

D

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

ఆస్త‌మా స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డేలా చేసే అద్భుత‌మైన చిట్కా..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.