Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Mutton Fry : మ‌ట‌న్ ఫ్రైని ఈ సీజ‌న్‌లో తినాల్సిందే.. ఇలా చేయాలి..!

Editor by Editor
September 16, 2022
in food, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Mutton Fry : మాంసాహార ప్రియుల్లో చాలా మంది మ‌ట‌న్‌ను ఎంతో ఇష్టంగా తింటుంటారు. మ‌ట‌న్‌తో మ‌ట‌న్ బిర్యానీ, కూర చేస్తారు. అయితే మ‌ట‌న్ ఫ్రైని కూడా మ‌నం చేసుకుని తిన‌వ‌చ్చు. మ‌ట‌న్ ఉడికేందుకు చాలా స‌మ‌యం ప‌డుతుంది. అందువ‌ల్ల ఫ్రైని చేసేందుకు ఎవ‌రూ అంత‌గా ఇష్ట‌ప‌డ‌రు. కానీ కాస్త ఓపిక ప‌డితే ఎంతో రుచిగా ఉండే మ‌ట‌న్ ఫ్రైని త‌యారు చేయ‌వ‌చ్చు. దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

make Mutton Fry in this way very tasty and healthy
Mutton Fry

మ‌ట‌న్ ఫ్రై త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

మ‌టన్ – 1 కిలో, ఉల్లిపాయ‌లు – 4, జీల‌క‌ర్ర – 1 టేబుల్ స్పూన్‌, ల‌వంగాలు – 3, కారం – రుచికి స‌రిప‌డా, ప‌సుపు – పావు టీస్పూన్‌, అల్లం వెల్లుల్లి పేస్ట్ -3 టేబుల్ స్పూన్లు, నూనె – స‌రిప‌డా, దాల్చిన చెక్క – స‌రిప‌డా, గ‌రం మ‌సాలా – ఒక టేబుల్ స్పూన్‌, క‌రివేపాకు – 2 రెబ్బ‌లు, కొత్తిమీర – ఒక క‌ట్ట‌, పుదీనా తురుము – పిడికెడు, పచ్చిమిర్చి – ఆరు, మిరియాల పొడి – 1 టీస్పూన్, నిమ్మరసం – అరచెక్క.

మ‌ట‌న్ ఫ్రై ని త‌యారు చేసే విధానం..

ముందుగా మటన్ ముక్కలను శుభ్రంగా కడగాలి. నీచు వాసన పోయే విధంగా పసుపు వేసి బాగా కలిపి నీరు పోసి కడగాలి. మటన్ ఉడికించడానికి చాలా సమయం పడుతుంది. అందుకనే ముందుగా కుక్కర్ లో వేసి మటన్‌ని ఉడికించుకోవాలి. ఒక కుక్కర్ తీసుకుని అందులో ముందుగా కడిగిపెట్టుకున్న మటన్ ముక్కలను వేయాలి. ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్‌ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. తరువాత పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. వీటన్నింటిని బాగా కలుపుకుని సరిపడినంత నీరు పోసుకుని మూత పెట్టి ఐదు నిమిషాల పాటు మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి.

ఇప్పుడు మటన్ ముక్కలను కుక్కర్‌లోంచి తీసి పక్కన పెట్టుకోవాలి. నీరు పోయేంత వరకు చూడాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకోవాలి. అందులో కావాల్సినంత నూనె వేసుకోవాలి. నూనె కాస్త వేడెక్కాక కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. వీటితో పాటే పొడవుగా కత్తిరించి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను అందులో వేసుకోవాలి. వీటిని బాగా వేపుకోవాలి. ఇప్పుడు లవంగాలు, దాల్చిన చెక్క‌ను వేసుకోవాలి. తరువాత ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్ ముక్కలను వేసుకోవాలి. బాగా కలిపి వేపుకోవాలి. ఇందులోనే మిరియాల పొడి, గరం మసాలా పొడి వేసుకోవాలి. వీటిని బాగా కలుపుకోవాలి. సన్నటి మంట మీద మట‌న్‌ను ఫ్రై చేసుకోవాలి. సుమారు 10 నిమిషాల పాటు వేపుకోవాలి. ఫ్రై కాబట్టి మూత పెట్టుకోకూడదు. ఇప్పుడు నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. అంతే.. రుచిక‌ర‌మైన మ‌ట‌న్ ఫ్రై రెడీ అయిన‌ట్లే. దీన్ని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Tags: Mutton Fry
Editor

Editor

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Asafoetida : ఇంగువ‌ను ఇలా తీసుకుంటే.. ఎన్నో స‌మ‌స్య‌ల‌కు విరుగుడుగా ప‌నిచేస్తుంది..

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.